‘పవన్ స్టార్ డమ్’ ఫై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

‘పవన్ స్టార్ డమ్’ ఫై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. వివాదాస్పద డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మ కు ఓ గుర్తింపు ఉంది. ఆయన ఎప్పుడు ఎవరి మీద ట్వీట్స్ చేస్తారో..ఎవరిపై విమర్శలు చేస్తారో ఆయనకు కూడా తెలియదు. అయితే మొదటి నుండి మెగా ఫ్యామిలీ ఫై ఎక్కువ ఫోకస్ పెట్టడం..మెగా హీరోల ఫై సెటైర్లు వేయడం వర్మ కు బాగా అలవాటు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫై. పవన్ సినిమాల పైనే కాదు ఆయన పార్టీ జనసేన పార్టీ ఫై కామెంట్స్ చేయడం..అభిమానులకు ఆగ్రహం తెప్పించడం చేస్తుంటాడు. అలాంటిది తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ ఫై పాజిటివ్ గా మాట్లాడి వార్తల్లో నిలిచారు.

గత కొద్దీ రోజులుగా ఏపీలో సినిమా టికెట్స్ ధరల విషయం హాట్ టాపిక్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ మూవీ రిలీజ్ కు ముందు ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం తో ప్రభుత్వం కావాలని పవన్ ను టార్గెట్ చేయడానికే ఇలాంటి నిర్ణయం తీసుకుందని అభిమానులు – జనసేన కార్యకర్తలు ఆరోపణలు చేసారు. ఇదే విషయాన్ని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తావించగా.. తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

‘కేవలం పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇది నిజమే అయితే ఎంతవరకు కరెక్ట్ అంటారు?’ అని ప్రశ్నించగా.. ‘అసలు నేను దాన్ని నమ్మను’ అని వర్మ అన్నారు. ”పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అనడం స్టుపిడ్ గా ఉంది. ఎందుకంటే దాని వల్ల పవన్ స్టార్ డమ్ పెరుగుతుందే తప్ప.. ఏమాత్రం తగ్గదు. పవన్ కు డబ్బులు రాకుండా చేయడానికే ఇలా చేశారు అనుకుంటే.. దీని వల్ల పవన్ కు వచ్చే డబ్బులు ఏమీ తగ్గవు” అని రామ్ గోపాల్ వర్మ చెప్పారు.

”మిగతా అందరి డబ్బుల్లో కోత విధిస్తారేమో కానీ.. స్టార్ హీరోలకు ఇచ్చే మనీ ఎప్పుడూ తగ్గదు. ఎందుకంటే వారి మూలంగానే జనాలు థియేటర్లకు వస్తున్నారు కాబట్టి. స్టార్ కు వచ్చే 100 కోట్లలో 80 – 60 కోట్లు మాత్రమే వస్తదనేది జరగదు” అని వర్మ చెప్పుకొచ్చారు.