పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు కర్రసాయంతో హాజరైన కేటీఆర్

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు కర్రసాయంతో మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అంతకు ముందు బుధవారం ఖమ్మంలో వివాహ రిసెప్షన్ ఘనంగా జరిపారు. ఈ వేడుకకు లక్షలాది మంది హాజరయ్యారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు సైతం ఈ విందుకు హాజరయ్యారు. వైఎస్ షర్మిల, ఈటల రాజేందర్, వివేక్ తదితరులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కానీ టీఆర్ఎస్ కీలక నేతలెవరూ రిసెప్షన్‌లో పాల్గొనకపోవడంతోఅంత రకరకాలుగా మాట్లాడుకోవడం చేసారు. పొంగులేటి పార్టీ మారుతున్నారని , బిజెపి లో చేరుతున్నారని అందుకే టిఆర్ఎస్ నేతలెవరూ రాలేదని ఇలా ఎవరికీ తోచినట్లు వారు మాట్లాడుకున్నారు.

కానీ హైదరాబాద్ లో ఏర్పటు చేసిన వివాహ రిసెప్షన్ వేడుకకు పెద్ద ఎత్తున టిఆర్ఎస్ నేతలు హాజరు కావడంతో పొంగులేటి పార్టీ మారతారనే వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది. ఏపీ సీఎం జగన్ మాతృమూర్తి విజయమ్మ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తదితరులు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ ఇప్పుడిప్పుడే కాలి గాయం నుంచి కోలుకుంటున్నారు. దీంతో ఆయన చేతి కర్రతోనే ఈ వేడుకకు హాజరు కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఫొటోలను పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేరిట ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు.