మునుగోడు మందుబాబులకు షాకింగ్ న్యూస్..

మునుగోడు నియోజకవర్గ మందుబాబులకు బ్యాడ్ న్యూస్. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు రోజుల పాటు వైన్ షాప్స్ బంద్ అవుతున్నాయి. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా నవంబర్ 1 నుండి నవంబర్ 3 వరకు వైన్ షాపులు మూసివేస్తున్నట్లు నల్గొండ జిల్లా ఎక్సైజ్‌ అధికారి సంతోష్‌ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని వైన్‌షాపులను నవంబర్ 1న సాయంత్రం 6 నుంచి నవంబర్ 3న సాయంత్రం 6 వరకు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. నియోజకవర్గంలోని మొత్తం 7 మండలాల్లో 128 మంది ఎక్సైజ్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ..వారంతా వైన్‌షాపుల్లో మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నట్లు సంతోష్‌ తెలిపారు.

ఇక మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతుంది. ఉదయం నుండి అర్ధరాత్రి వరకు పది మంది లో ఆరుగురు మద్యంతో ఊగిపోతున్నారు. దీనికి కారణం ఉప ఎన్నికే. మునుగోడు ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతూ ఓటర్లకు ఏంకావాలంటే అది ఇస్తున్నారు. డబ్బు , మద్యం, భోజనం ఇలా అని సమకూరుస్తుండడంతో ఓటర్లు ప్రతి రోజు పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటె నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 1 తేదీతో అభ్యర్థుల ప్రచారానికి తెరపడనుంది. నవంబర్ 6న ఫలితాలు విడుదల కానున్నాయి.