బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్న పంజాబ్ మాజీ సీఎం

,

దేశ వ్యాప్తంగా బిజెపి పార్టీలోకి వలసలు ఆగడం లేదు. రీసెంట్ గా గోవాలో ఏకంగనా ఎనిమిది మంది కాంగ్రెస్ నేతలు చేరగా..తాజాగా ఇప్పుడు పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బిజెపి తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 19 (సోమవారం)న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అందుకు గాను సెప్టెంబర్ 18న ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. అలాగే తన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పిఎల్‌సి)ని కూడా బీజేపీలో విలీనం చేసే చాన్స్ ఉందని అంటున్నారు.

కెప్టెన్‌తో పాటు ఆయన కుమారుడు రణ్ ఇందర్ సింగ్, కుమార్తె ఇందెర్ కౌర్, మనుమడు నిర్వాణ్ సింగ్ కూడా బీజేపీలో చేరనున్నారు. అమరీందర్ సింగ్ గతేడాది కాంగ్రెస్ ను వీడి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, శిరోమణి అకాలీ దళ్ (సంయుక్త్)తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు. కానీ ఆ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ తో పాటు ఆ పార్టీ అభ్యర్థులంతా ఓడిపోయారు. ఇక ఇప్పుడు బిజెపి లోకి చేరేందుకు సిద్ధమయ్యారు.