ఈ ఏడాది వింబుల్డన్‌ టోర్నీ రద్దు

రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఇదే తొలిసారి.

wimbledon
wimbledon

లండన్‌: కరోనా దెబ్బకు ప్రముఖ టెన్నిస్‌ టోర్నీ వింబుల్డన్‌ రద్దు అయింది. ఈ విషయాన్ని ఆల్‌ ఇంగ్లాండ్‌ లాన్‌ టెన్నిస్‌ క్లబ్‌, ఛాంపియన్‌ షిఫ్‌ నిర్వహణ కమిటీలు వెల్లడించాయి. ఈ ఏడాది జూన్‌ 29 నుంచి జూలై 12 వరకు జరగాల్సిన ఈ టోర్ని కరోనా వల్ల రద్దు అవుతున్న టోర్నీల జాబితాలో చేరింది. రెండవ ప్రపంచ యుద్దం తరువాత టోర్నీ వాయిదా పడడం ఇదే తోలిసారి. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ టోర్నీ ని రద్దు చేస్తున్నాము, వచే ఏడాది జూన్‌ 28 నుంచి జూలై 11 మధ్య ఈ టోర్నిని నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటి ప్రకటించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/