సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా చూడండి.. డబ్ల్యూహెచ్‌వో

ఈ విషయంలో భారత చర్యలు మెరుగ్గా ఉన్నాయి

tedros adanom
tedros adanom

జెనీవా: ప్రపంచ దేశాలు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఈ విషయంలో భారత చర్యలు మెరుగ్గా ఉన్నాయని ప్రశంశలు కురింపించింది. ఇప్పటికే భారత్‌లో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదని మోదీ ప్రభుత్వం 24 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌, 20 కోట్ల మందికి డబ్బులు బదిలి చేస్తున్నారని, ప్రపంచదేశాలకు భారత్‌ను ఉదాహరణగా చూపెట్టింది. సామాజిక సంక్షేమం కోసం , ఆహరంతో పాటు ఇతర నిత్యావసరాలను అందించటం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాల ప్రభుత్వాలను కోరాను అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ టెడ్రోస్‌ అధనమ్‌ తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/