గచ్చిబౌలి లో కారు ఢీకొని ఒకరు మృతి

శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం వద్ద ఘటన

One killed in road accident in Gatchibowli
One killed in road accident in Gatchibowli

Hyderabad: గచ్చిబౌలి లో ఇవాళ తెల్లవారు జామున అతి వేగంగా వస్తున్న కారు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఎదురుగా రామచందర్(48) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/