అయోధ్య రామాల‌య ప్రారంభోత్స‌వానికి ఆహ్వానం అందిందిః మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే

 దీనిపై త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకుంటాం..మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే

Will take decision on Ram Temple consecration ceremony invite ‘very soon’: Mallikarjun Kharge

న్యూఢిల్లీ:ఈనెల 22వ తేదీన అయోధ్య‌లో రామాల‌యాన్ని ఓపెన్ చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఆ ప్రారంభోత్స‌వానికి సంబంధించిన ఆహ్వానం అందింద‌ని, త్వ‌ర‌లోనే దీనిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే తెలిపారు. ఈడీ, ఐటీ లాంటి శాఖ‌ల‌ను బిజెపి దుర్వినియోగం చేస్తోంద‌న్నారు. భార‌త్ జోడో న్యాయ యాత్ర‌లో పాల్గొనేందుకు పౌర‌హ‌క్కుల నేత‌ల్ని ఆహ్వానించిన‌ట్లు ఖ‌ర్గే వెల్ల‌డించారు. కేంద్ర ప్ర‌భుత్వం తెచ్చిన కొత్త కార్మిక చట్టాల‌ను ఆయ‌న వ్య‌తిరేకించారు. నియంతృత్వ సంకేతాల‌న్నారు. మ‌ణిపూర్‌లో చాలా దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని, కానీ ఫోటో షూట్ల కోసం మోడీ బీచ్‌ల‌కు వెళ్లారు కానీ మ‌ణిపూర్‌కు ఎందుకు వెళ్ల‌లేద‌న్నారు. భార‌త్ జోడో న్యాయ యాత్ర‌కు చెందిన లోగోను, నినాదాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు.