చంద్రబాబు బతికి ఉన్నంతవరకూ నారా కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తారు – మంత్రి కాకాణి

ఏపీలో ప్రస్తుతం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఫై వైస్సార్సీపీ vs టీడీపీ గా మారింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీను వైస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం పట్ల టీడీపీ నేతలతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ మరింత వైరల్ గా మారాయి. బాలయ్య కామెంట్స్ కు వైస్సార్సీపీ నేతలు వరుసపెట్టి కౌంటర్లు ఇస్తున్నారు.

ఇప్పటికే పలువురు ఘాటు ఘాటు వ్యాఖ్యలు చేయగా..తాజాగా మంత్రి కాకాణి..చంద్రబాబు బతికి ఉన్నంతవరకూ నారా కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తారు…నందమూరి కుటుంబాన్ని పట్టించుకోరని ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్.టి.ఆర్.ను కూడా కలవవద్దని పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పారని , టీడీపీ లో కొందరు నేతలు జూనియర్ ఎన్.టి.ఆర్.ను కోరుకుంటున్నారాని కాకాణి అన్నారు. చంద్రబాబు చదువుకున్న స్కూల్ ను కూడా నాడు..నేడు లో జగన్ అభివృద్ధి చేశారని, ఎన్.టి.ఆర్ పేరు జిల్లాకు పెట్టి ఎన్టీఆర్ ఫై జగన్ కు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. అమరావతి రైతుల యాత్ర కు అన్నీ చంద్రబాబే సమకూరుస్తున్నారు..ఆయన కనుసన్నల్లోనే యాత్ర జరుగుతుందని ఆరోపించారు.