ఇక పై ఎన్డీయే కూట‌మిలోనే కొన‌సాగుతా : నితీష్ కుమార్‌

Will remain in NDA fold forever now.. Bihar CM Nitish Kumar

న్యూఢిల్లీః ఇక ఎప్ప‌టికీ ఎన్డీయే కూట‌మిలో కొన‌సాగుతూ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తామ‌ని బిహార్ సీఎం నితీష్ కుమార్ బుధ‌వారం పేర్కొన్నారు. మ‌హాకూట‌మి నుంచి బ‌య‌ట‌ప‌డి బిజెపి మ‌ద్ద‌తుతో బిహార్‌లో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన అనంత‌రం నితీష్ కుమార్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. విప‌క్ష కూట‌మికి మ‌రో పేరు ఎంచుకోవాల‌ని తాను కోరినా ఇండియా పేరును ఖ‌రారు చేశార‌ని నితీష్ ఆరోపించారు. ఇప్ప‌టివ‌ర‌కూ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఏ పార్టీ ఎన్ని స్ధానాల్లో పోటీ చేస్తుంద‌ని వారు నిర్ణ‌యించుకోలేక‌పోయార‌ని ఎద్దేవా చేశారు. దీంతో తాను విప‌క్ష కూట‌మిని వీడి గ‌తంలో త‌న ప్ర‌యాణం సాగించిన వారి ప‌క్షానికి చేరుకున్నాన‌ని, ఇక ఇప్ప‌టినుంచి ఎన్డీయే కూట‌మిలోనే ఎప్ప‌టికీ కొన‌సాగుతామ‌ని స్ప‌ష్టం చేశారు. బిహార్ ప్ర‌జ‌ల అభివృద్ధి కోసం పాటుప‌డ‌తాన‌ని అన్నారు. నూత‌న ప్ర‌భుత్వం ఫిబ్ర‌వ‌రి 10న రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస ప‌రీక్ష‌ను ఎదుర్కొంటుంద‌ని చెప్పారు. మ‌రోవైపు నితీష్ కుమార్ యూట‌ర్న్ మాస్ట‌ర్ అని కాంగ్రెస్‌, ఆర్జేడీలు ఆరోపించాయి. న‌రేంద్ర మోడీ యూట‌ర్న్ మాస్ట‌ర్ అనుకుంటే నితీష్ కుమార్ ఆయ‌న‌ను మించిపోయార‌ని వ్యాఖ్యానించారు.