ఏపిలో స్థానిక ఎన్నికల వాయిదాపై నేడు సుప్రీంలో విచారణ

supreme court
supreme court

న్యూఢిల్లీ: ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రమేష్ కుమార్ వాయిదా వేయడం వెనుక దురుద్దేశం ఉందని ప్రభుత్వం తన పిటిషన్‌లో తెలిపింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిపేలా ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తాను అన్ని చర్యలూ తీసుకుంటున్నానని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో వివరించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగూణంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయనీ… కనీసం హైకోర్టుకు సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీటిని వాయిదా వేశారని ఏపి ప్రభుత్వం తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/