వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్ పై పోటీ చేస్తా: ఈటల

బెంగాల్ మాదిరి ఇక్కడ కూడా సీఎంను ఓడించాలని పిలుపు

Etala Rajender
Etala Rajender

హైదరాబాద్ః వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని, కేసీఆర్ ను ఢీకొంటానని బిజిపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి ముందే చెప్పానని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్నానని అన్నారు. కేసీఆర్ ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. పశ్చిమబెంగాల్ సీన్ తెలంగాణలో రిపీట్ అవుతుందని అన్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీ నేత సువేందు అధికారి ఓడించారని… పశ్చిమబెంగాల్ మాదిరే ఇక్కడ కూడా ముఖ్యమంత్రిని ఓడించాలని చెప్పారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/