ముఖ్యమంత్రి ఇంట్లో కరోనా విలయతాండవం ..భార్య, పిల్లలులతో సహా 15 మంది సిబ్బందికి కరోనా

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృభిస్తుంది. ప్రతి రోజు వేలసంఖ్య లు దాటి లక్షల్లో కొత్త కేసులు నమోదు అవుతుండడంతో మరోసారి లాక్ డౌన్ ప్రస్తావన వినిపిస్తుంది. ఇదిలా ఉంటె తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. భార్య, పిల్లలతో పాటు మొత్తం 15 మంది సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అయితే సీఎం హేమంత్ సోరెన్ కు మాత్రం నెగిటివ్ గా వచ్చిందిని రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు.

ముఖ్యమంత్రి నివాసంలో మొత్తం 62 మందికి కరోనా పరీక్షలు చేయగా.. శనివారం సాయంత్రానికి 24 మంది రిపోర్టులు వస్తే వాటిలో 15 మందికి పాజిటివ్ గా తేలింది. హేమంత్ సోరెన్ భార్య కల్పనా సొరెన్.. ఆయన ఇద్దరు కుమారులు నితిన్, విశ్వజిత్, కోడలు సరళా ముర్ముకూ కూడా కరోనా సోకింది. అయితే కరోనా సోకినవారందరికీ కేవలం స్వల్ప లక్షణాలు ఉండటంతో ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నారు.

ఇక దేశ వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 1,59,632 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా వల్ల మరో 327మంది మృతి చెందారు. 40,863 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కొవిడ్​ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 10.21 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.