రాష్ట్రపతి రామ్ నాథ్ తో సచిన్ టెండుల్కర్ భేటీ

ముంబయిలోని రాజ్ భవన్ లో సమావేశం

ముంబయి: క్రికెట్ దిగ్గజం, భారతరత్న పురస్కార గ్రహీత సచిన్ టెండుల్కర్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలుసుకున్నారు. ముంబై వచ్చిన రామ్ నాథ్ రాజ్ భవన్ లో శుక్రవారం సచిన్ తో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా ట్విట్టర్ పేజీలో ప్రకటించింది. పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. ఇది మర్యాద పూర్వక భేటీయేనని తెలుస్తోంది.

రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 25తో ముగియనుంది. మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉండడం గమనార్హం. మరోవైపు ‘‘మీకు వంద కోట్ల మందికిపైగా మద్దతు బలం ఉంది. మంచిగా ఆడి, మెరుగైన ఫలితాలు సాధించాలి’’అంటూ భారత జట్టుకు సచిన్ పిలుపునివ్వడం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/