గురువు ఎవరు?

ఆధ్యాత్మిక చింతన

Shirdi-Sai-Baba
Shirdi-Sai-Baba

ఒకసారి ఈ ప్రపంచం అనిత్యం అని తెలిసిననాడు, నాకింకా ఈ లోకంతో పని లేదని గ్రహించనప్పుడు గాని, ఆధ్యాత్మికం వైపు మనిషి పోతాడు.

గురువు అవసరం వెంటనే కొందరకు తెలియవస్తుంది. గురువు యొక్క అవసరం కొంత మందికి తెలియనే తెలియదు.

దైవం కూడా జిజ్ఞాసులకు ప్రత్యక్షంగా ఆధ్యాత్మిక బోధలు చేయడు. గురువ్ఞ వద్దకు పొమ్మంటాడు. దేవుడైనా, దేవియైనా. సాయిబాబాకు కూడా గురువు అవసరాన్ని గుర్తించి, అన్వేషణ సాగించాడు.

రామకృష్ణ పరమహంసకు కూడా వివిధ మతాలల్లో వివిధ సాంప్రదాయాల్లో గురువులు ఉన్నారు. స్వామి మహేశ్వర్‌నాథ్‌జీ కాల్మేరీయోగి.

ఖోన్మో అనే గ్రామం హరీశ్వర్‌ అనే పర్వతముల వద్ద ఉంటుంది. ఖోన్మో అంటే మోక్షము.

ఈ గ్రామానికే రాజతరంగిణిని రాసిన కల్హనుడు చెందుతాడంటారు.

విశ్వనాథధర్‌ కుమారుడు స్వామి మహేశ్వర్‌ నాథ్‌ జీ. విశ్వనాథధర్‌ మిక్కిలి పేదవాడు. కాని సద్దుణములు కలవాడు.

అతి కష్టం మీద ఆ తండ్రి తన కుమారుడైన మహేశ్వర్‌ నాథుని మూడవతరగతి వరకు తేగలిగాడు. తేగలిగాడు అంటే మహేశ్వర్‌ తెలివి తక్కువాడని అర్ధం కాదు.

ఆర్థికంగా తనిని మూడవతరగతి వరకు చదివించలమే గగనమయింది. మహేశ్వరనాథుడు మూడవతరగతిలో ఉండవ పాఠశాలకు తనిఖీ ఇనస్పెక్టరు వచ్చాడు.

ఆ ఇనస్పెక్టరు నిశితంగా అందరినీ పరీక్షించసాగాడు.

మహేశ్వర నాథుని పరీక్షించాడు. చక్కటి సమాధానాలు చెప్పాడు. ఎంతో జ్ఞానం ఆ విద్యార్థికి న్నదని గ్రహించి, ఈ విద్యారిథని మూడవ తరగతి ఉండి సరాసరి 5 వ తరగతికి ఉంచండి అని చెప్పాడు

పాఠశాల వారికి. కాని మహేశ్వరుడు 5లో చేరలేదు. ఆర్థిక పరిస్థితుల వల్ల 3లోనే అంటే 5వ తరగిలో – 4 వ తరగతిలో చేరనక్కరలేకుండా చేరి చదవలేకపోయాడు.

పాఠశాల చదువు 3వ తరగతి వరకే అతనికి. కొలది కాలంలోనే ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపాడు అతడు. శారికాదేవిని కొన్ని సంవత్సరాలు కొలిచాడు. (ప్రార్థించాడు).

ఆమె ఒకనాడు అతనితో ఉదయమే బాణమొహల్ల వద్ద ఉన్న జీలం నదికి పో. అక్కడ నీ గురువు ఉంటాడు అన్నది.

ఆ రాత్రి అంతా అతనికి నిద్ర లేదు. ఎప్పుడు తెల్లవారు తుందా? ఎప్పుడు గురువ్ఞను దర్శిస్తానా అని అతనికి ఆ రాత్రి కునుకు లేదు.

తెల్లవార కుండానే జీలం నది ఒడ్డుకు పోయాడు. ఎవరో ఒక వ్యఇక్త వచ్చి నదీ జలాలకు నమ స్క రించి ప్రాతః కాల సంధ్యను చేసుకున్నాడు. అతని మోహం చూడటానికి వీలు లేకపోయింది.

ఎందుకంటే ముఖానికి అడ్డంగా ఆదువ తువ్వాలు (తుండుగుడ్డ) ఉన్నది.

సంధ్య అనంతరం ఆ వ్యక్తి ఇంటికి బయలుదేరాడు. ఆ వ్యక్తికి తెలియకుండానే అతనిని అనుసరించాడు. అతడు నడిచిన మార్గమంతా, మహేశ్వర్‌కు తెలుసు.

చివరకు ఒక వీధిలోకిని పోయాడు. ఆ వీధిలో ఉండే ప్రతి వ్యక్తి మహేశ్వర్‌కు తెలుసు. ఆ వ్యక్తి ఒక ఇంట్లోకి పోయాడు. మహేశ్వర్‌ అతని వెంట పోయి అతని మోహం చూశాడు.

అతడు ఎవరో కాదు మేనత్త కుమారుడు (తండ్రి సోదరి కుమారుడు). ఆతడు గొప్ప సత్పురుషుడని ఎవరికీ తెలియదు.

చివరకు ఆయన భార్యకే తన భర్త మహనీయుడని గుర్తించకుండా మసిలాడు. ఆయన మహేశ్వరనాదుని శిష్యునిగా స్వీకరించాడు.

మహేశ్వరుడు కొండపై ధ్యానం చేస్తుంటే, ఎప్పుడైనా వాన కురిసేది. కానీ ఒక్క నీటిబొట్టు మహూేశ్వరునిపై పడేది కాదు.

ఎండవేడి విపరీతంగా ఉన్నా మహేశ్వరునిపై పడేది కాదు. ఒక చల్లని నల్లని కారు మేఘం ఎండపడకుండా గొడుగులా కాపు కాసేది.

సాధక స్థితిలోనే అలా ఉన్న మహేశ్వరుడు, తన స్థితిని ఇతరులు గుర్తించకుండా జాగ్రత్త పడేవాడు!

  • యం.పి.సాయినాథ్‌

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/