యాదాద్రి ప్ర‌ధానాల‌య ఉద్ఘాట‌న‌కు ముహుర్తం ఖరారు

yadadri-temple

హైదరాబాద్: యాదాద్రి ప్ర‌ధానాల‌య ఉద్ఘాట‌న‌కు ముహుర్తం ఖ‌రారైంది. ఈ నెల 28న ప్ర‌ధానాల‌యంలో మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ నిర్వ‌హించ‌నున్నారు. అదే రోజు మిథున‌ల‌గ్న సుముహుర్తంలో మ‌హాకుంభాభిషేకం నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆల‌య అర్చ‌కులు తెలిపారు. సాయంత్రం శాంతి క‌ల్యాణం నిర్వ‌హించ‌నున్నారు. 21 నుంచి 28వ తేదీ వ‌ర‌కు పాంచ‌రాత్రాగ‌మ ప‌ద్ధ‌తిలో ఉద్ఘాట‌న పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు. 21న ఉద‌యం 9 గంట‌ల‌కు విశ్వ‌క్సేనుడికి తొలిపూజ చేయ‌నున్నారు. స్వ‌ప్తిపుణ్యాహ‌వ‌చ‌న మంత్ర ప‌ఠ‌నాల‌తో ప్ర‌ధానాల‌య ఉద్ఘాట‌న జ‌ర‌గ‌నుంది. 21 నుంచి వారం రోజుల పాటు బాలాల‌యంలో పంచ‌కుండాత్మ‌క హోమం చేప‌ట్ట‌నున్నారు. బాలాల‌యంలో ఉద్ఘాట‌న పూజ‌ల నేప‌థ్యంలో శుక్ర‌వారం నుంచి ఆర్జిత సేవ‌లు నిలిపివేయ‌నున్నారు. పాత‌గుట్ట ఆల‌యంలో ఆర్జిత సేవ‌లు జ‌రిపించుకోవాల‌ని ఆల‌య అర్చ‌కులు సూచించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/