కేరళ ఓటర్లు ఎటువైపు వెళ్తారు..?

కేరళ ఓటర్లు ఎటువైపు వెళ్తారు..?

కేరళ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్న 140 అసెంబ్లీ నియోజక వర్గాల ఎన్నికలు ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభం అయ్యాయి. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశాయి. ఇక ఈ ఎన్నికల్లో తమదే గెలుపని అన్ని పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు మాత్రమే కీలకం కానుంది.

ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే గత కొంత కాలంగా కేరళ ఓటర్లు ఒక సంప్రదాయాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. ఒకసారి గెలిచిన పార్టీకి మళ్లీ ఎన్నికల్లో పరాజయం పాలు చేస్తూ అధికారాన్ని మారుస్తూ వస్తున్నారు అక్కడి ఓటర్లు. దీంతో ఈసారి కూడా ఇదే సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ సీపీఐ నేతృత్వంలోని ఎల్డిఎఫ్ కూటమిని ఓటర్లు చిత్తుగా ఓడించడం ఖాయమని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ పార్టీతో పాటు నిపుణులు అంటున్నారు. అయితే కేరళ ముఖ్యమంత్రి విజయన్ మాత్రం ఈసారి కూడా రాష్ట్ర ఓటర్లు తమకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

ఇక కేరళలో తమ పట్టు చూపించేందుకు బీజేపీ కూడా తెగ ప్రయత్నిస్తోంది. మెట్రోమెన్ శ్రీధరన్‌ను తమ పార్టీ అభ్యర్థిగా దించిన కమలం పార్టీ, కేరళలో జెండా పాతాలని చూస్తుంది. ఏదేమైనా కేరళ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఎన్నికలు మునుపెన్నడూ లేని విధంగా రసవత్తరంగా మారియి. మరి అక్కడి ఓటర్లు ఎటువైపు వెళ్తారనేది మరికొద్ది ఫలితాల నాడు తేలనుంది.