దృశ్యం 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. అప్పుడేనా?

మలయాళంలో తెరకెక్కిన దృశ్యం చిత్రం అక్కడ ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ కావడంతో, ఈ సినిమాను అనేక భాషల్లో రీమేక్ చేశారు. తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన దృశ్యం చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఇక ఇటీవల వచ్చిన దృశ్యం-2 చిత్రం కూడా ప్రేక్షకాదరణ పొందడటంతో, ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ క్రమంలో దృశ్యం-2 చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో ఇండస్ట్రీ వర్గాల్లో తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను అంతర్జాతీయ ఫాదర్స్ డే సందర్భంగా జూన్ 20న రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దృశ్యం-2 చిత్రంలో తన పిల్లల కోసం ఓ తండ్రి పడే ఆవేదన, ఆరాటం మనకు చూపించబోతుండటంతో, ఈ సినిమాను ఫాదర్స్ డే రోజున రిలీజ్ చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన మీనా నటిస్తుండగా, కృతిక, ఈస్తర్ అనిల్, నదియా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.