వకీల్ సాబ్‌కు సెన్సార్ కత్తెర

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఆయన నటించిన కొత్త చిత్రం వకీల్ సాబ్ మరో రెండు రోజుల్లో రిలీజ్‌కు రెడీ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమా తాజాగా సెన్సా్ర్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలోని కొన్ని అభ్యంతకరమైన డైలాగులను సెన్సార్ బోర్డు తొలగించినట్లు పేర్కొంది.

మహిళలను కించపరిచే విధంగా ఉన్న ఆ డైలాగులను సినిమాలో నుండి తీసేయాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. ఇక ఈ సినిమాలో పలు సన్నివేశాలను కూడా మ్యూట్ చేయాల్సిందిగా సెన్సార్ తెలిపింది. వారు తెలిపిన విధంగా చిత్ర యూనిట్ ఆయా సీన్స్, డైలాగులను తొలగించడంతో ఈ సినిమాకు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులకు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్యాలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా పవన్ సరసన అందాల భామ శృతి హాసన్ ఓ కేమియో రోల్ చేస్తో్న్న సంగతి తెలిసిందే. మరి బాక్సాఫీస్‌ను వకీల్ సాబ్ ఏ విధంగా షేక్ చేస్తాడో తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.