ఎయిర్ లైన్స్ బుకింగ్స్ ప్రారంభం

ఎయిర్ ఇండియా ప్రకటన

Air India

New Delhi: ఎంపిక చేసిన దేశీయ రూట్లలో మే 4 నుంచి ప్రయాణాలకు సంబంధించిన బుకింగ్స్‌ ప్రారంభినట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

ఎంపిక అంతర్జా తీయ రూట్లకు సంబంధించి జూన్‌ 1 నుంచి బుకింగ్స్‌ స్వీకరిస్తు న్నట్టు వెల్లడించింది.

అంతర్జాతీయంగా నెలకొన్న ఆరోగ్య ఆందొ ళనల నేపథ్యంలో మే 3, 2020 వరకు సంబంధించిన అన్నీ బుకింగులను నిలిపివేశామని పేర్కొంది.

అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి మే 31, 2020 వరకు బుకింగ్స్‌ రద్దు చేశామని ఎయిరిండియా వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ ప్రచురించింది.

ఎంపిక చేసిన దేశీయ రూట్లలో మే 4, 2020 నుం చి ప్రయా ణాలకు సం బంధిం చిన బుకిం గ్స్‌ను తెర చాం. అం తర్జా తీయ ప్రయాణాలకు సంబంధించి జూన్‌ 1, 2020 నుంచి బుకింగ్స్‌ అందు బాటులో ఉన్నాయని నోటిఫికేషన్‌లో ఎయి రిండి యా పేర్కొంది.

ఇదిలావుండగా మార్చి 24 నుంచి భారత్‌లో లాక్‌డౌ న్‌ కొనసాగుతోంది. మే వరకు పొడగించిన లాక్‌డౌన్‌ కొనసాగనుంది.

ఈ పిరియడ్‌లో అన్నీ దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే.

తాజా ‘నిఘా’ వార్తల కోసం :https://www.vaartha.com/specials/investigation/