జనసేన లోకి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతల వలసల పర్వం కొనసాగుతుంది. టీడీపీ , జనసేన పార్టీల్లోకి పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలు , మాజీ ఎమ్మెల్యేలు , మంత్రులు చేరుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ..జనసేన లో చేరారు. ఇటివ‌లే వైసీపీకి రాజీనామా చేసిన వెంట‌నే ఆయ‌న జ‌న‌సేన(Janasena) అధ్యక్షుడు ప‌వ‌న్ కల్యాణ్ తో భేటి అయ్యారు. పవన్ తో భేటీ కాగానే ఆయన జనసేన లో చేరతారని అంత భావించారు. అంత భావించినట్లే ఈరోజు ప్రకటన చేసారు.

ఆదివారం అనకాపల్లిలో తన అభిమానులు, మద్దతుదారులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కొణతాల ఈ విషయం తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌కు రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక ఉందని, రాజీలేని పోరాటం చేసే వ్యక్తి ఆయనని అన్నారు. రాష్ట్రంలో అరాచకపాలన అంతమొందించాల్సి అవసరం ఉందని మాజీ మంత్రి ఉద్ఘాటించారు.

‘పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడే వ్యక్తి.. ఎటువంటి ఎజెండా లేని వ్యక్తి.. అందుకే పవన్, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయి.. ఆయన వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేయాలి అనుకుంటున్నా.. ఆయనకు చిత్త శుద్ధి ఉంది.. ఏపీని అభివృద్ధి చేయాలి.. నిధులు రావాలి.. రైల్వే జోన్, ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలు, ఇలా ఎన్నో అంశాలు చర్చించాం.. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఒక్కటే నినాదం వినిపిస్తుంది’ అని కొణతాల ప్రకటించారు.