మహానాడు కాదు.. టీడీపీ “మహా నటుల” నాడు – ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు వేడుకలు నేడు , రేపు అట్టహాసంగా జరగబోతున్నాయి. కొద్దీ సేపటి క్రితం అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. పార్టీ జెండాను ఎగురవేసి మహానాడును ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి భారీ ఎత్తున ఈ వేడుకలకు కార్యకర్తలు , అభిమానులు , నేతలు హాజరయ్యారు.

ఇదిలా ఉంటె ఈ వేడుకలపై వైస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఘాటు వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు నా కంటే గొప్ప నటుడని ఎన్.టి.ఆర్.ఎప్పుడో చెప్పారు….మ్యాని ఫేస్టో గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబునాయుడుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ పై చెప్పులు వేసిన చంద్రబాబు ఎలా మహానాడులో శతజయంతి వేడుకలు చేస్తారని ప్రశ్నించింది. మహానాడులో ఎన్టీ ఆర్ కు క్షమాపణ కోరుతూ తీర్మానం పెట్టండని డిమాండ్‌ చేశారు. మహానాడులో నిరుద్యోగులు ..డ్వాక్రా మహిళలకు క్షమాపణ కోరుతూ తీర్మానం పెట్టాలని , పోలవరం ప్రాజెక్టు జాప్యానికి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఓట్ల కోసం ఎన్ని కుట్రలు..దొంగ తీర్మానాలు పెట్టినా జనం టిడిపి పార్టీని నమ్మరని ఎద్దేవా చేశారు.