డిసెంబర్‌ 5 నుండి వైకుంఠద్వార దర్శనం

TTD chairman YV Subba Reddy

తిరుమల: టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో డిసెంబర్‌ 5 నుండి పది రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచనున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మాలను మీడియాకు వెల్లడించారు.


నడకమార్గంలో ఉన్న గోపురాలకు మరమ్మతులు తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం డీజిల్‌ బస్సుల స్థానంలో 100 నుంచి 150 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామన్నారు. పద్మావతి అమ్మవారికి 11 కిలోల బంగారంతో సూర్యప్రభ వాహనంను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రూ.29 కోట్లతో తిరుమలలో కాటేజీల ఆధునీకరణ చేస్తామన్నారు. ఏపీలోని జిల్లా కేంద్రాల్లో కళ్యాణమస్తు పునఃప్రారంభిస్తామని చెప్పారు. బాలమందిరంలో రూ.10 కోట్లతో అదనపు హాస్టల్‌ భవనంను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/