రాష్ట్రానికి టూరిస్టుగా వచ్చే పవన్ అభివృద్ధి గురించి మాట్లాడం ఏమిటి ?: మంత్రి అవంతి

అమరావతి: ఏపీలో జనసేన ఆవిర్భావ సభలో, ప్రభుతంపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనపై పవన్ చేసిన ఆరోపణలపై ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందిస్తూ కౌంటర్ వేసాడు. నేను రాజకీయపరంగా హీరోనని, పవన్ సినిమాలో మాత్రమే హీరో అని వ్యాఖ్యానించారు. తన పై నిన్న పవన్ పలు విమర్శలు చేశారని, తాను మంత్రిగా ఉండడం ఏపీ దౌర్భాగ్యం అని పవన్ అన్నారని, మరి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం కూడా ప్రజలు దౌర్భాగ్యం అనుకోవాలా? అని ఆయన ప్రశ్నించాడు. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అంటూ చెపుకుంటారని, తాను కూడా ఆయనను ఓ సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నానని అన్నారు. తెలంగాణలో బీజేపీతో జనసేన పోతు ఉన్నదా? అని అడిగారు. తెలంగాణ టీఆర్ఎస్ తో పొత్తు, ఏపీలో బీజేపీతో పొత్తు ఉంటుందా? .. అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గతం టీడీపీ తో పోతు నుంచి ఎందుకు బయటకు వచ్చారని ఆయన నిలదీశాడు. మళ్లీ ఇపుడు టీడీపీలో ఎందకు కలుస్తానంటున్నారని ఆయన అడిగాడు.

రాష్ట్రానికి టూరిస్టుగా వచ్చే పవన్ కళ్యాణ్ అభివృద్ధి గురించి మాట్లాడడం ఏంటని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ కు అహంభావం అధికంగా ఉంటుందని, అందుకే పవన్ కళ్యాణ్ సినిమాలు అధిక శాతం ప్లాప్ అవుతున్నాయని చెప్పుకొచ్చారు. పవన్ సినిమాల్లో ఎక్కువ పరాజయాలే ఉన్నన్ని చెప్పారు. తాను ఎమ్మల్యేగా, మంత్రిగా గత మూడేళ్ల కాలంలో జనసేన కార్యకర్తల పై గూండాగిరి చేసారని అన్నటున్న పవన్ కళ్యాణ్ దానిని నిరూపించాలని, అలా చేస్తే తాను ఎమ్మల్యే పదవికి రాజీనామా చేస్తానని అని అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/