ఆహార కొరత తీరేదెన్నడు?

ఆహారం అనేది మనిషి ప్రాథమిక అవసరాలలో అతి ముఖ్యమైనది. ప్రపంచ ఆహార,వ్యవసాయ సంస్థ నివే దిక ప్రకారం ప్రపంచంలో ఇంకా 25 శాతం దేశాలు ఆకలి, పేదరికాన్ని అనుభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 11.3 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. మనదేశంలో 50 శాతం శిశు మరణాలకు పౌష్టికాహారలోపమే ప్రధాన కారణమని పలు నివేది కలు చెపుతున్నాయి.

food shortages (File)

మానవ్ఞనికి శక్తినిచ్చే పోషకాహారంలో పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్ఞ్వ ముఖ్యమైనవి. దేశంలో ప్రజ లకు ఆహారం ద్వారా లభించే శక్తివినియోగంలో పిండిపదార్థాల వాటా 71శాతం, మాంసకృతుల వాటా 10 శాతం, కొవ్ఞ్వ 19 శాతం.దీనిని బట్టి పిండిపదార్థాలలో ఎక్కువగాఉందని గమనించ వచ్చు.మనుషుల మధ్య ఆర్థికవ్యత్యాసాలు నానాటికీ పెరుగుతుం డటం కూడా ఆకలి సమస్యకు కారణమవ్ఞతోంది. ప్రపంచంలో కొందరు ఆకలితో అలమటిస్తుంటే ఇంకొందరు నిర్లక్ష్యంగా ఆహార పదార్థాలను వృధా చేస్తున్నారు.ఆహార పదార్థాల వృధాను సమ ర్థంగా అరికట్టగలిగితే ఆకలి సమస్యను చాలావరకు అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఆహార కొరత ప్రాధాన్యతను గుర్తించిన ఐక్యరాజ్యసమితి తన అనుబంధ సంస్థ అయిన ఆహార, వ్యవ సాయ సంస్థ ద్వారా ప్రపంచ ప్రజలందరికీ పౌష్టికాహారం అందిం చడం జీనవ ప్రమాణాలను మెరుగుపరచడం, ఆహార వ్యవసాయ దిగుబడులను పెంచడం లక్ష్యంగా పనిచేస్తుంది. ఆహార కొరత తీరాలంటే వ్యవసాయరంగం అభివృద్ధిచెందాలి. ఆహారోత్పత్తి కంటే జనాభా పెరుగుదల అధికంగా ఉండటం వలన ఆహార సమస్య మరింత తీవ్రరూపం దాలుస్తున్నది. పేదరికం వల్లనే సాధారణంగా పౌష్టికాహార కొరత తీవ్రంగా ఏర్పడుతుంది.

కావలసిన పరిణా మంలో సంతులిత ఆహారాన్ని వినియోగపర్చుకోవడానికి వారి ఆదాయస్థాయి లేని కారణం వల్ల ప్రజలలో ముఖ్యంగా చిన్న పిల్లల్లో ప్రోటీన్లలోపం, విటమిన్ల లోపం, ఐరన్‌, అయోడిన్‌ తగిన పరిమాణంలో అందకపోవడంతో మహిళలు ఎక్కువగా నష్టపోతు న్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు కావలసిన ఆహార ధాన్యాలను ఎంత భారీగా ఉత్పత్తి చేయగలిగినా వృధాను కూడా అదేస్థాయిలో నివారించడానికి తగిన ప్రణాళికలు రూపొందించా ల్సిన అగత్యం ఏర్పడింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొన్ని చోట్ల ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడుతుంటే మరికొన్ని చోట్ల సరైన సాధనాసంపత్తి కరవవడం వల్ల తిండిగింజలు వినియోగానికి దక్కకుండాపోతున్నాయి.

ఆహారధాన్యాలను భవిష్యత్‌ అవసరాల కోసం నిల్వ చేసుకునేందుకు తగిన సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా దేశాల్లో దాదాపు 40శాతం మేరకు తిండిగింజలు వినియో గానికి పనికిరాకుండా నాశనమైపోతున్నాయి. మనదేశజనాభాలో పోషకాహార లోపంతో 14.5శాతం బాధపడుతున్నారు. 20.8 శాతం తక్కువ బరువ్ఞతో ఉన్న ఐదేళ్లలోపు పిల్లలున్నారు. ఐదేళ్ల పిల్లల్లో 37.9 శాతం ఎదుగుదల లోపాలు ఉన్నవారు ఉన్నారు.

51.4శాతం రక్తహీనతతో బాధపడుతున్న మహిళలున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 130 కోట్ల టన్నుల ఆహారం వృధా అవ్ఞతోంది.వృధా అవ్ఞతున్న ఆహారం విలువ రూ.184.31 లక్షల కోట్లు. మనదేశంలో ఏటా వృధాఅవ్ఞతున్న పండ్లు, కూరగా యల విలువ రూ.38,500 కోట్లు. ఆహార వృధావల్ల పర్యావర ణంలో కలుస్తున్న కార్బన్‌ డయాక్సైడ్‌330 కోట్ల టన్నులు. ఆహార వృధావల్ల పరోక్షంగా జరుగుతున్న నీటివృధా 250 క్యూసెక్కులు. ఆహారం వృధా కారణంగా కూడా భూతాపం అంతకంతకు పెరుగు తోంది.పోషకాహార లోపం,వయస్సుకు తగ్గబరువ్ఞ ఎత్తు ఉండకపో వడం శారీరక ఎదుగుదల లోపించడం, శిశుప్రాయం దాటి ఎదుగు తున్న దశలో పౌష్టికాహారలోపం, శిశుమరణాలు ఆకలి సూచిని పరిగణిస్తారు. దేశంలో నాలుగువంతు జనాభా పేదరికం గీతకింద ఉన్నారు.

దేశంలోని పేదలకు ఆహార భద్రతను చేకూర్చే క్రమంలో ఇప్పటికీ మూడురకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఐసిడి ఎస్‌ పేరిట బాలింతలకు, ఆరు సంవత్సరాలలోపు ఉన్న శిశువ్ఞల కు, పౌష్టికాహారాన్ని అందచేసే కార్యక్రమం, విద్యార్థులకోసం మధ్యాహ్నభోజనం,దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ఉద్దేశించి అమలు చేస్తున్న ప్రజాపంపిణీ కార్యక్రమం, పౌష్టికాహార లోపంతో అనేక సమస్యలకు అంటకడుతున్నా ప్రస్తుతం సబ్సిడీ ధరలకు నడిపే సామాజిక భోజన శాలలు దేశంలో సామాజిక వికాసానికి దోహదం చేస్తాయి.

పేదరికం, ఉద్యోగభద్రత కొరవడ టం ఆహారకొరత,ఆహారపదార్థాల వృధాసాధనా సంపత్తి లోపాలు, అస్థిరమైన మార్కెట్లు, భూతాపం కారణంగా ఏర్పడుతున్న వాతా వరణ మార్పులు, అట్టడుగువర్గాలపై వివక్షవంటివి ఆకలి సమస్య కు ప్రధానకారణాలుగా నిలుస్తున్నాయి.మార్కెట్లో ఆహార ధాన్యాల, ప్రధాన పంటల ధరలు విపరీతంగా పెరగడం వల్ల కూడా తాత్కా లికంగా చాలామంది ఆకలితో అలమటించే పరిస్థితులు ఏర్పడుతు న్నాయి.ఆరోగ్యవంతమైన జీవనానికి పోషకవిలువలు కల ఆహారం కావాలి.ప్రజలందరికీ కావలసిన మౌలికఆహారం అన్ని కాలాల్లోనూ భౌతికంగాఆర్థికంగా తప్పనిసరిగా అందుబాటులో ఉంచడం ఆహార భద్రత 2019 ప్రపంచఆకలి సూచిలో గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో భారతదేశం 117దేశాల్లో102వస్థానంలో ఉంది.

ఆకలి, పౌష్టికాహార లోపం, చిన్నారుల్లో బరువ్ఞ తక్కువ సమస్య,ఎదుగుదల లోపం, ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటు వంటి అంశాల ప్రాతిపదికన జరుగుతుంది. మనదేశంలో 2017-18 మధ్య సంవత్సరంలో 27.50కోట్ల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. మనదేశ జనాభాకు కడుపు నిండా తిండికి 23 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఆహారధాన్యాలు అవసరమని ప్రపంచ ఆర్థిక నివేదిక అంచనా వేసింది.

ప్రస్తుతం దేశంలో 40శాతం మంది పిల్లలుపౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. మనదేశంలో దాదాపు 50శాతంమంది ఆధారపడిన వ్యవసాయరంగం జిడిపిలో 31శాతం వాటాను కలిగి ఉంది. చౌకధరల దుకాణాల ద్వారా బియ్యంతోపాటు ఇతర నిత్యావసర సరుకులను, చిరుధాన్యాలను దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి సబ్సిడీపై అందించాలి. ప్రజలందరికీ ఆహారాన్ని అందించాలంటే ఆహారధాన్యాల ఉత్పత్తిని, పాడిసంపదను, మత్స్యసంపదను కోళ్లను పెంచాలి.

  • ఆర్‌విఎం.సత్యం

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/