గందరగోళంగా ‘పౌరసత్వ’ సవరణ

అసలు నీవు ఈ దేశ పౌరుడివేనా? అని సగటు మనిషిని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి, ఇక్కడే బూడిదైన వాళ్ల తాలూకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మీ తల్లితండ్రుల జన్మస్థలాలు, ఇతర వివరాలు ఉంటే అవి సరైనవేనా కాదా? ఇక్కడ జీవిస్తున్న మీరు ఇతర దేశాల నుండి వలస వచ్చారా? ఆక్రమణదారులా? సక్రమదారులా తేలాల్సిఉంది. మీ మూలాలేమిటో చెప్పాల్సి ఉంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 8,14,15,21కి వ్యతిరేకంగా పౌరసత్వసవరణ చట్టం తీసుకొచ్చింది. ఈ దేశపౌరులా కాదా? అనేది ఎన్నార్సీ నిర్ణ యిస్తుంది. ఈ దేశస్థులా? విదేశీయులా అనేది సిఎఎ నిర్ణ యిస్తుంది.

పౌరుల జనాభాను ఎన్సార్సీ లెక్కిస్తోంది. ఒకదాని కొకటి లింకుతో దేశపౌరుల పౌరసత్వాన్ని కావాలని ప్రశ్నిస్తు న్నారు. తద్వారా పౌరులను అవమానపరచటం అనాగరిక సమాజ లక్షణమే! 70ఏళ్ల గణతంత్ర రాజ్యంలో నివసిస్తున్న ప్రతి పౌరుడు ప్రభుత్వం అడిగే ప్రశ్నలకి జవాబివ్వాల్సిందే. సరైన ఆధారాలు ఇవ్వాల్సిందే. ప్రభుత్వం చేసే సర్వేకు ఆధారా లివ్వకుంటే మీరు అక్రమవలసదారులే! ఇది నిజం. మీరు ఏ దేశం నుంచో అక్రమంగా ఇక్కడికి వలసవచ్చారు.ఇక్కడ అక్రమం గా జీవిస్తున్నారు.అందుకే మీ కోసం రెడీగా నిర్బంధ శిబిరాలు న్నాయి.

ఎక్కడైతే మీ హక్కులు రక్షించబడతాయో, ఎక్కడైతే మీకు భద్రత ఉంటుందో మీరు అక్కడికి తక్షణమే వెళ్లాలి. ఈ దేశానికి అక్రమంగా వలస వచ్చిన వారిని గుర్తించి ఖాళీ చేయ డానికి సాధనమే జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌. ‘జాతీయ పౌర సత్వ రిజిస్టర్‌ (ఎన్నార్సీ)ని సృష్టించడానికి జాతీయ జనగణన రిజిస్టరు మొదటి అడుగని 2014 నవంబరు 26న ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికీి ఎవరు పౌరులు? అక్రమం గా వలస వచ్చినవారేవరు? దానికి సంబంధించిన ప్రాతిపదిక ఏమిటనేది ప్రభుత్వం వద్ద స్పష్టత లేదు.

అయినప్పటికీ దేశ పౌరుల్లో గందరగోళ పరిస్థితిని కల్పిస్తున్నారు. అసొంలో అమలు చేసిన పౌరసత్వ రిజిస్టర్‌ వల్ల ఎన్నార్సీ అంటే ఏంటో అర్థం అవ్ఞతున్నది. అది ఒక నమూనాగా చూడొచ్చు. అదే ఇప్పుడు కేవలం మైనార్టీలే కాక జనాధిక్యత కలిగిన సమూహాలను సైతం అనుమానంలోకి నెట్టివేసింది. ఇది కేవలం హిందూ-ముస్లింల మధ్యసమస్య మాత్రమే కాదు. ఈ నేలపై పుట్టిన ప్రతి జీవికి జీవన్మరణ సమస్య. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన అసొం లో ఎన్నార్సీ మానవ సంక్షోభానికి దారి తీసింది.వారిలో జీవిత కాల విషాదానికి కారణమైంది.

19లక్షల మంది ఈ దేశ పౌరు లు కాదన్నా ఈ విషయాన్ని ఎలా జీర్ణించుకోగలం. అసొంలోని ఆరు నిర్బంధ కేంద్రాలలో 988 మందిని బంధించారు. అందు లో 28 మంది చనిపోయారు. 19 లక్షల మందిలో హిందువ్ఞ లు, ముస్లింలు, ఇతర మతస్తులున్నారు.వారిలో భార్యల నుంచి భర్తలను, తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేశారు. వారి పరి స్థితి అత్యంత దారుణంగా ఉంది. సిఎఎ, ఎన్నార్సీ అమలులో ముస్లిం వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడే పుట్టిన బిడ్డ శరణార్థినని చెప్పుకోవాలా? తన పౌరసత్వం ఎలా నిరూపించు కోవాలి? లేదా నేను భారతీయుడినేనని ఎలా చెప్పుకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానాల్లేవు.’

ఓటరు కార్డు, ఇతర ప్రభుత్వ డాక్యుమెంట్లు పౌరసత్వాన్ని నిర్ధారించవని, ఆధార్‌ పౌరసత్వాన్ని అసలు నిరూపించదని కేంద్ర మంత్రి అన్నారు. ప్రభుత్వ అధికా రులు మంజూరు చేసిన డాక్యుమెంట్లు ప్రభుత్వం ఆమోదించే లిస్టులో ఉండవని మరోవైపు చెబుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న అన్ని పత్రాలను మళ్లీ పౌరులు సమర్పించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. ఈ దేశ పౌరుడునని నిరూపించుకోలేకపోతే శాశ్వతకాలం ఓటుహక్కు కోల్పోతారు.

అదే తరుణంలో ప్రభుత్వం నుంచి మంజూరైన పథకాలు, ఆస్తులను కోల్పోవడం తప్పదు. దేశంలో సుమారుగా నలభైరెండు కోట్ల మంది పేదలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్నారు. వారికి నివాస స్థలాలు, ఇతర ఆధారాల్లేవు. నిరక్షరాస్యత, పేదరికం కారణంగా ఎలాంటి డాక్యుమెంట్లు లేక పౌరసత్వాన్ని నిరూపించుకునే అవకాశం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో దేశంలో ఎలాంటి సంక్షోభానికి దారితీస్తుందో గ్రహించవచ్చు.

ఉషోదయాన్ని పూయిస్తోన్న షాహీన్‌బాగ్‌

ఇప్పుడు ఢిల్లీ నగరంలోని షాహీన్‌బాగ్‌ కొత్త పాఠాన్ని నేర్పుతుంది. భారతదేశ ముఖచిత్రంపై చరిత్రను లిఖిస్తోంది. సిఎఎ, ఎన్‌పిఆర్‌, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటాన్ని షాహీన్‌బాగ్‌ తన కర్తవ్యంగా నిర్వర్తిస్తుంది. ఆ పోరాటంలో పిల్లాజెల్లా ముసలి, ముతక, వయసుతో సంబంధం లేకుండా, లింగబేధం అసలే లేకుండా పోరాటంలో అగ్రభాగాన నిలుస్తుం ది.

మతాలకతీతంగా ఐక్యతను ప్రదర్శిస్తూ దేశభక్తిని షాహీన్‌ బాగ్‌ చాటుకుంది. పౌరసత్వం పేరుతో ప్రజల్ని చీల్చే కుట్రలను చీల్చి చెండాడుతోంది. షాహీన్‌బాగ్‌ ప్రజానీకం ముందుచూపుతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన వైనాన్ని గుర్తించింది.

డిసెం బర్‌ 15న నలుగురితో ప్రారంభమైన నిరసన కార్యక్రమం ప్రళ యాగ్ని సృష్టిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.చిటపటచిను కులుగా ప్రారంభమైన ఉద్యమం సమరశీలంగా కొనసాగతూ దేశ ప్రజానీకాన్ని ఆకర్షిస్తోంది. మహిళల చైతన్యానికి ప్రతీకగా నిలు స్తోంది. ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో షాహీన్‌ బాగ్‌ ఎన్నికల అస్త్రంగా మారింది. హింసాత్మక సంఘట నలను రాజ్యాం ప్రోత్సహిస్తే చివరకు మిగిలేది రక్తపాతమే.

-మామిండ్ల రమేష్‌రాజా
(రచయిత: సిపిఐ(ఎం.ఎల్‌) లిబరేషన్‌ కార్యవర్గ సభ్యుడు)

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/