పర్యావరణ సమతుల్యతకు ప్రపంచ దేశాలు కట్టుబడాలి

జంతు జీవరాశులను కూడా సర్వనాశనం చేసే దిశగా పర్యావరణ సమస్య

environmental balance
environmental balance

ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడతోపాటు జంతు జీవరాశులను కూడా సర్వనాశనం చేసే దిశగా పర్యావరణ సమస్య ఉంది.

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరిగిపోతున్న విషయాన్ని ప్రపంచదేశాలు ముందుజాగ్రత్త చర్యలో భాగంగా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అభివృద్ధి దిశలో పయనిస్తున్నామన్న సంగతిని పదేపదే చెబుతున్న దేశాధినేతలు పర్యావరణ సమస్యల పట్ల పెద్దగా పట్టించుకున్నట్లు కనబడడం లేదు. ముఖ్యంగా పారిశ్రామిక ఉత్పత్తులు పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నాయని చెప్పవచ్చు.

మారిన కాలం దృశ్య అభివృద్ధి ఉత్పత్తి రెండు సమాన స్థాయిలో పయనించడం కోసం మనం చేస్తున్న ప్రయత్నాలు పర్యావరణాన్ని తీవ్రంగా నష్టపరుస్తుంది అన్న విషయాన్ని గమనించాలి.

భారతదేశం వంటి అభివృద్ధి చెందు తున్న దేశాలలో విస్తృతంగా దేశవ్యాప్తంగా విదేశాలకు చెందిన బడా పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి పరిశ్రమల స్థాపనకు మన ప్రభుత్వాలు దారులు తెరుస్తున్నాయి.

దేశంలో ఇప్పటివరకు పారిశ్రామిక విప్లవం, వ్యవసాయ విప్లవం, సాంకేతిక విప్లవం అని మూడు వర్గాలుగా విభజించి ఏ విభాగానికి ఆ విభాగాన్ని అభివృద్ధిపరచాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి.

అయితే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పర్యావరణ సమస్యల కారణంగా ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో పారిశ్రామిక అభివృద్ధి ముందువరుసలో ఉన్నదని చెప్పుకుంటున్నాం.

అయితే దీని పక్కనే ఉన్న పర్యావరణ సమస్యను నివారించడంలో ఆయా ప్రభుత్వాలు ఆయా దేశాల అధినేతలు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల నేడు పర్యా వరణ సమస్య తలెత్తుతుందని చెప్పవచ్చు.

ముఖ్యంగా పారిశ్రామిక ఉత్పత్తిపై పారిశ్రామికవేత్తలు చేపడుతున్న చర్యలు 1/4 ఉత్పత్తిని పెంచాలని చూస్తున్నాయి తప్ప పరిశ్రమల నుండి వస్తున్న వ్యర్ధపదార్థాలు పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆలోచించడం లేదు.

ఈ వ్యర్థాలు మానవాళి మనుగడపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

కేవలం మానవ మనుగడ కాకుండా జంతు జీవరాశులు కూడా పర్యావరణ సమస్యతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

ముఖ్యంగా పెరిగిపోతున్న పట్టణీకరణ కారణంగా సమీ పంలోని గ్రామీణ ప్రాంతాలు పారిశ్రామిక ఉత్పత్తుల వల్ల పరిశ్రమల నుండి వెలువడుతున్న వ్యర్ధపదార్థాల వల్ల వ్యవ సాయరంగం తీవ్రంగా దెబ్బతింటుంది.

పొగ,పదార్థాలు భూగర్భజలాలలో కలవడం వల్ల కలుషిత నీరు తాగడం, వ్యర్ధపదార్థాలు తగలబెట్టడం వల్ల వచ్చే పొగ వల్ల మానవులకు, జంతుజీవరాశులకు శ్వాసకోశ వ్యాధులు సంక్రమిస్తున్నాయి.

ఇంత తీవ్రమవ్ఞతున్న పర్యావరణాన్ని పరిరక్షించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు చేపట్టాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు.

జంతువ్ఞల నుండి మానవాళికి సంక్రమించే వ్యాధులు అపారమైన ఆర్థిక ప్రాణ నష్టాలను సృష్టిస్తున్నాయని పదేపదే వృద్ది చేస్తుంది.

ఒక ప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన ప్లేగు వ్యాధి ఎలుకల నుండి సంక్రమించిందని,ఈ వ్యాధిబారినపడి ఐదుకోట్ల మంది మరణించగా వారిలో సగం ఆసియా,ఆఫ్రికాలో కన్నుమూ శారు.

మిగతా ప్రాణనష్టం ఐరోపాలో జరిగింది.అప్పటి ఐరోపా జనాభాలో నాలుగో వంతు ప్లేగు వ్యాధి వల్ల మరణించారని చెప్పవచ్చు.

1918-20 మధ్యపడిన స్పానిష్‌ఫ్లూ ప్రపంచ వ్యాప్తంగా ఐదు కోట్లమంది ప్రాణాలు తీసింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ మహమ్మారి మృత్యువుకు బలైపోయిన వారి సంఖ్య 10 లక్షలకు చేరుకుంది.

దేశాలు ఉమ్మడి కార్యాచరణకు ఉద్రిక్తం కాకపోతే కరోనా మరణాలు 20 లక్షలు దాటిపోతా యని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) హెచ్చరిస్తుంది.

దీనివల్ల ప్రతి ఒక్కరు సురక్షితం కానిదే ఏ ఒక్కరు ధీమాగా ఉండే వీల్లేదు అన్న ప్రాప్తకాలజ్ఞత కొరవడిన కొన్నిదేశాల ఒంటెద్దు పోకడల్ని డబ్ల్యుహెచ్‌ఓ తప్పుపడుతుంది.

కొవిడ్‌ జన్మస్థలం చైనాలో కరోనాకు బలైన వారి సంఖ్య 4,650 లోపు, రెండు లక్షలు దాటిపోయిన మరణాలతో అగ్రరాజ్యం అమెరికా బావురుమంటున్నది.మరో వారంలో లక్షకు చేరనున్న మృతుల సంఖ్య ఇండియాను దుఃఖలిచలితంచేస్తుంది.

కరోనా వైరస్‌ గబ్బిలాల, అలుగుల నుంచి మానవులకు వ్యాప్తి భావిస్తున్నారు.

అదేవిధంగా ప్రపంచాన్ని ఒక పది సంవత్సరాలు గడగడలాడించిన మరొక అంటువ్యాధి ఎయిడ్స్‌ హెచ్‌ఐవి వైరస్‌ చింపాంజిల నుంచి మనుషులకు సంక్రమించిందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు.

ఇలా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే రోగాలను జూనోటిక్‌ వ్యాధులు అంటారు.

ఆఫ్రికాలో చింపాంజీలను వేటాడే వారికి వాటి రక్తం ద్వారా హెచ్‌ఐవి సోకిందని గబ్బిలాలు అలుగులు తినడం వల్ల కరోనా వైరస్‌ విస్తరించిందని నిర్ధారణ అయింది.

ఈ విధంగా మానవుడు తన వినాశనాన్ని తానే కొనితెచ్చుకున్నాడు. పెరిగి పోతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చడానికి అడవులు నరికితే పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది.

అడవులను నరకడం వల్ల జీవజంతురాసులు అడవులను వదిలి జన నివాసాలలోకి వస్తున్న విషయాన్ని మనం రోజూ చూస్తున్నదే.

జంతువుల అక్రమ రవాణా వల్ల రకరకాల వైరస్‌లు, ఇతర రోగకారిక క్రీములు ప్రపంచ నలుమూలలకు వ్యాపిస్తున్నాయి.

దీని ద్వారా మానవాళి మనుగడకు సంక్రమించిన కరోనా వైరస్‌ నేడు ప్రపంచ దేశాలకు వ్యాపించింది.

ప్రపంచ మానవాళి వన్యప్రాణి రక్షణ సంస్థ డబ్ల్యుహెచ్‌ఓ, డబ్ల్యూ డబ్యూఎఫ్‌ ప్రచురించిన లివింగ్‌ ప్లానెట్‌ 2020 నివేదిక ధృవీకరించింది.

మానవ కార్యకలాపాల వల్ల గడిచిన 46 ఏళ్లలో మానవాళి, జంతుజాలం జనాభా సగటున 60 శాతం మేర తగ్గిపోయిందనే భయానక వాస్తవాన్ని ఈ నివేదిక వెల్లడిస్తోంది.

ఈ క్షీణత క్షీరదాలు మొదలుకొని పాములు, కప్పలు, చేపల వరకు కనిపిస్తుంది.

మానవుడు చేస్తున్న పర్యావరణ విధ్వంసం మరెన్నో వైరస్‌లు వ్యాధుల వ్యాప్తికి దారితీయనున్నందున ఆలోచన మరింత భయం కలిగిస్తుంది.

1970-2016 మధ్యకాలంలో నాలుగువేలకుపైగా వెన్నెముకగల జీవుల సంఖ్యలో తగ్గుదలను లివింగ్‌ప్లానెట్‌ సూచి ఎల్‌పిఐ పరిగణనలోకి తీసుకుంటుంది.

మానవాళి నివాస ప్రాంతాలలో మంచినీటి ఆవాసాల్లో సంఖ్య 1970 నుంచి ఏటా నాలుగు శాతం చొప్పున తగ్గిపోతూ వచ్చింది. ఈ లెక్కన 1970-2016 మధ్యకాలంలో 84 శాతం తగ్గుదల నమోదయింది.

ప్యారిస్‌ ఒప్పందానికి అంగీకరించిన దేశాలు అమలులో మాత్రం విఫలమయ్యాయి. ఏటా ఉద్గా రాలు పెరుగుతూనే ఉన్నాయి.

వాతా వరణ మార్పులు తోడైన సందర్భంలో పెను తుఫానులు జంటగా వస్తాయని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త మైకేల్‌ చెప్తున్నారు.

భూతాపంతో పెరుగుతున్న ఉష్ణోగ్రత 1970తో పోలిస్తే ఐదురెట్లు పెరిగింది. ఏదిఏమైనప్పటికీ వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనించి పర్యావరణ సమతుల్యతను పెంపొందించడానికి అందరం కట్టుబడి ఉండాలి.

  • డాక్టర్‌ రక్కిరెడ్డి ఆదిరెడ్డి

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/