ఢిల్లీలో ఉద్రిక్తతలు.. 27కు చేరిన మృతులు

పోలీసులకు చీవాట్లు పెట్టిన సుప్రీంకోర్టు

delhi
delhi

న్యూఢిల్లీ: ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈనేపథ్యంలో మరణించిన వారి సంఖ్య 27కు చేరుకుంది. ప్రస్తుతం ఢిల్లీ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక జనం భయంభయంగా గడుపుతున్నారు. ఉద్రిక్తతలను చల్లార్చేందుకు రంగంలోకి దిగిన కేంద్రం.. పరిస్థితిని అదుపులోకి తెచ్చే బాధ్యతను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌కు అప్పగించింది. బుధవారం పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినప్పటికీ ఉద్రిక్తంగానే ఉంది. కాగా ఢిల్లీ అల్లర్లపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చూస్తుంటే ఇవి గుజరాత్ అల్లర్లను తలపిస్తున్నాయని సీపీఎం పేర్కొంది. ఢిల్లీ అల్లర్ల గురించి మాట్లాడేందుకు తమకు సమయం ఇవ్వాలంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రాష్ట్రపతికి లేఖ రాశారు. మరోవైపు, ఢిల్లీ అల్లర్లపై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. అల్లర్లను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారంటూ చీవాట్లు పెట్టింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/