ప్రధాని మోడి అనుమతిస్తే ఆలయాలు తెరుస్తాం

ప్రధాని మోడికి కర్ణాటక ప్రభుత్వం లేఖ

BS Yediyurappa speaking at an event.
Yeddyurappa

కర్ణాటక: కర్ణాటకలో ఆల‌యాలు తెరిచేందుకు ప్రధాని నరంద్రమోడి నిర్ణయం కోసం వేచిచూస్తున్నామ‌ని క‌ర్నాట‌క సిఎం కార్యాల‌యం పేర్కొన్న‌ది. మే 31వ తేదీ త‌ర్వాత‌ రాష్ట్రంలో ఆల‌యాలు, మ‌సీదులు, చ‌ర్చిల‌ను ఓపెన్ చేయ‌నున్న‌ట్లు కర్ణాటక సిఎం ప్ర‌క‌టించారు. కానీ ఈ అంశంలో ప్ర‌ధాని నిర్ణ‌యం కోసం వేచిచూస్తున్న‌ట్లు ఇవాళ కర్ణాటక సిఎం కార్యాల‌యం పేర్కొన్న‌ది. మార్చి 24వ తేదీన ప్ర‌ధాని ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో ఆల‌యాల‌న్నీ మూత‌ప‌డ్డాయి. అయితే జూన్ ఒక‌ట‌వ తేదీ నుంచి మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాల‌ను ఓపెన్ చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ప్ర‌ధాని మోడికి కర్ణాటక ప్ర‌భుత్వం లేఖ రాసిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ అనుమ‌తి వ‌స్తే, ఒక‌ట‌వ తేదీ నుంచి ఆల‌యాల‌ను తెరుస్తామ‌ని సిఎం అన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/