రేపు ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తాం: సిఎం రేవంత్‌ రెడ్డి

cm revanth reddy

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు ఈరోజు స్వేచ్ఛ వచ్చిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆయన మాట్లాడారు. “పదేళ్లుగా నిరంకుశత్వాన్ని ప్రజలు మౌనంగా భరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇప్పటికే ప్రగతిభవన్‌ ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించాం. సంక్షేం, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చుదిద్దుతాం. శుక్రవారం ఉదయం జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తాం. మీ బిడ్డగా.. మీ సోదరుడిగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా” అని రేవంత్‌ చెప్పారు.

తెలంగాణ ఎన్నో త్యాగాల, పునాదుల మీద రాష్ట్రం అని తెలిపారు. ప్రగతి భవన్ వద్ద ఇనుప కడ్డీలను బద్దలు కొట్టించాను. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావుపూలే ప్రజాభవన్ లో ప్రజా దర్భార్ నిర్వహిస్తున్నామని.. మీరందరూ హాజరుకావాలని కోరారు. నగర అభి ద్ధి కోసం శాంతి భద్రతలను కాపాడుతూ.. ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ముందుకు వెళ్తామని తెలిపారు. ఏ దిక్కు లేదనే పరిస్థితి లేకుండా ఉండకుండా చూస్తాను. పేదరికాన్ని తరిమికొడతానని తెలిపారు. అమరవీరుల ఆకాంక్షను నెరవేరుస్తాం. ప్రభుత్వం ఏర్పడటానికి లక్షలాది మంది కార్యకర్తలు త్యాగాలను మరిచిపోమన్నారు.