ఢిల్లీలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్

ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

న్యూఢిల్లీ : ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన కలకలం రేపింది. ఇప్పుడు అది రాజకీయ రంగు పులుముకుంది. బాధితురాలి కుటుంబాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలుసుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులను తన వాహనంలో కూర్చోబెట్టుకుని, వారిని పరామర్శించారు. మరోవైపు బాధిత కుటుంబాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పరామర్శించబోతున్నారు. అంతకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఖీ బిడ్లాన్, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ తదితరులు కూడా పరామర్శించారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే, నాంగల్ శ్మశానవాటిక నుంచి నీటిని తెచ్చేందుకు వెళ్లిన తొమ్మిదేళ్ల చిన్నారి ఆ తర్వాత తిరిగి రాలేదు. ఆ తర్వాత ఆమె మృతదేహం శ్మశానవాటిక వద్ద కనిపించింది. కరెంట్ షాక్ కొట్టి ఆమె చనిపోయిందని భావించిన తల్లిదండ్రులు ఆమెకు దహన సంస్కారాలను నిర్వహస్తుండగా… విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు వచ్చి చితిమంటలపై నీటిని చల్లి, మృతదేహాన్ని బయటకు తీశారు. అంతేకాదు, బాలిక మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/