టీమిండియా జెర్సి ధరించిన ధోనిని ఇక చూడలేం

హర్బజన్‌ సింగ్‌ అభిప్రాయం

harbajan singh
harbajan singh

ముంబయి: టిమిండియా జెర్సి ధరించిన ధోనిని మళ్ళి చూడలేం అని టిమిడింయా వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్బజన్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా రోహిత్‌ శర్మతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గోన్న హర్బజన్‌ పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. లైవ్‌ సందర్బంగా ధోని తిరిగి ఎపుడు అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడతాడని ఓ అభిమాని ప్రశ్నించగా భజ్జి సమాధానం ఇచ్చాడు. ధోని ఐపిఎల్‌ లో ఆడాలని కృత నిశ్చయంతో ఉన్నాడు. కాని ఇక్కడ అందరికి తెలియాల్సింది ఏంటంటే భారత జట్టుకు ఆడాలని ధోని ఆశిస్తున్నాడా లేదా నా అంచని ప్రకారం టిమిండియాకు ఆడాలనే ఆసక్తి ధోనికి లేదు. మళ్లి టిమిండియా జెర్సి ధరించాలని అతనికి లేదు. గత ప్రపంచకప్‌లోనే చివరి మ్యాచ్‌ ఆడేశానని అతను భావిస్తున్నట్లు హర్బజన్‌ చెప్పాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/