వర్షం ముంచింది..దక్షిణాఫ్రికాతో తొలి వన్డే రద్దు

india vs south africa 1st odi cancel
india vs south africa 1st odi cancel

ధర్మశాల: అనుకున్నట్లు గానే వర్షం కొంప ముంచింది. వర్షం కారణంగా దక్షిణాఫ్రికా-భారత్‌ల మధ్య ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి వన్డే రద్దయింది. కనీసం టాస్ కూడా వేయని పరిస్థితుల్లో ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ వర్షార్పణం అయింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేకు వేదికైన ధర్మశాలలో గత రెండ్రోజులుగా వర్షం కురుస్తోంది. ఇవాళ కూడా వరుణుడు ప్రత్యక్షం కావడంతో మైదానాన్ని మ్యాచ్ కు అనువుగా చేసేందుకు సిబ్బంది ప్రయత్నాలన్నీ వ్యర్థం అయ్యాయి. మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ నిర్వహణ కష్టమేనని తేల్చారు. పదేపదే వర్షం అంతరాయం కలిగిస్తుండడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/