ఆసియా గేమ్స్‌ 2030 ఆతిథ్య రేసులో రెండు దేశాలు

బిడ్‌ దాఖలు చేసిన సౌది అరేబియా, ఖతార్‌

asia games
asia games

న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్‌ 2030 ఆతిథ్య హక్కుల కోసం సౌది అరేబియా, ఖతార్‌ దేశాలు బిడ్‌ దాఖలు చేసినట్లు ఒలిపింక్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆసియా(ఓసిఏ) ప్రకటించింది. ఈ ఈవెంట్‌ నిర్వహణ హక్కుల కోసం బిడ్‌ దాఖలు చేయడానికి ఓసిఏ ఏప్రిల్‌ 22 ఆఖరి తేదిగా నిర్ణయించగా.. సౌది అరేబియా రాజధాని రియాద్‌, ఖతార్‌ రాజధాని దోహ వేదికగా ఆసియా గేమ్స్‌ నిర్వహించేందుకు బిడ్‌ దాఖలు చేశాయని తెలపింది. ఈ రెండు దేశాలు ముందుకు రావడంతో ఓసిఏ అధ్యక్షుడు షేక్‌ అహ్మద్‌ అల్‌ఫహద్‌ అల్‌ సబాహ్‌ సంతోషం వ్యక్తం చేశారు. కాగా 2030 ఆతిథ్య హక్కుల విషయంపై తుది నిర్ణయాన్ని నవంబర్‌లో వెల్లడిస్తామని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/