చంద్రబాబును బలహీన వర్గాల వాళ్లేవరూ క్షమించరు

న్యాయస్థానం తీర్పునకు అణుగుణంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తాం

botsa satyanarayana
botsa satyanarayana

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న హైకోర్టు తీర్పును గౌరవిస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారయణ స్పష్టం చేశారు. న్యాయస్థానం తీర్పునకు అణుగుణంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే 59 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని..దీన్ని టిడిపి అడ్డుకుందని ఆయన విమర్శించారు. 59 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పిటిషన్‌ వేసిన ప్రతాపరెడ్డి..చంద్రబాబుకు సన్నిహితుడంటూ బొత్స ఫోటోలు ప్రదర్శించారు. ఈ రిజర్వేషన్లు అడ్డుకున్న చంద్రబాబును బలహీన వర్గాల వాళ్లెవరూ క్షమించరని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం నిధులు రావని..అందుకే టిడిపి ఈ కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/