ప్రజావాక్కు

Voice of the People
Voice of the People

విధి నిర్వహణలో నిర్లక్ష్యంష -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా


స్వాతంత్య్రం సిద్ధించి 72 సంవత్సరాలైనా ఇప్పటికీ దేశంలో అర్హులైన అందరికీ ఓటు హక్కు కల్పిస్తూ ఓటర్ల జాబితాను రూపొందించడంలో ఎన్నికలసంఘం దారుణంగా విఫలమవ్ఞ తోంది. ఓటుహక్కును విద్యుక్తపౌరధర్మంగానో లేక ప్రాథమిక హక్కుగానో కాకుండా స్వీయఅస్తిత్వచిహ్నంగా భావించే స్థాయి లో ఓటర్లు పరిణితి కనబరుస్తుంటే ఓట్ల గల్లంతుతో తప్పుల తడకగా జాబితాలు తయారు చేయడం బాధాకరం. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఈనెలలో జరగనున్న పురపాలక సంఘా ల ఎన్నికలలో కేవలం 53 లక్షల మందికి ఓటు హక్కు కల్పి స్తూ జాబితానువిడుదల చేయడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. దీనికితోడు రిజర్వేషన్ల ఖరారుకు ముందే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే! అభివృద్ధిచెందిన దేశాలలో అయితే ఒక్కరికి ఓటుహక్కు నిరాక రించినా అది పెద్ద నేరంగా పరిగణించబడుతుంది. ఆ స్థాయికి మన ప్రజాస్వామ్యం ఎన్నికల నిర్వహణ పరిణితి చెందాలి.

శిధిలావస్థలో దేవాలయాలు -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం


సింహాచలం క్షేత్రంతో సమానమైన విశాఖజిల్లా భైరవస్వామి క్షేత్రం అభివృద్ధి ఆమడదూరంలో ఉంది. చారిత్రక ప్రాధాన్యత ఉన్న సింహాచలానికి అనుబంధంగా ఉన్నఈదేవాలయం ప్రస్తు తం శిధిలావస్థకు చేరుకోవడం లక్షలాది భక్తులకు మనస్తాపం కలిగిస్తోంది. ప్రతి అమావాస్యకు నలభైవేల మంది భక్తులు భైరవ్ఞని దర్శనం చేసుకుంటుండగా భక్తులకు కనీస సౌకర్యా లు లేకపోవడం బాధాకరం. ప్రధాన రహదారి నుండి లోపలికి వెళ్లాల్సిన ఒక కిలోమీటరు మార్గం రాళ్లు, రప్పలు, గోతులు, పాముల పుట్టలతో భయంకరంగా ఉంటుంది. ఈ ప్రాంతం అటవీశాఖ పరిధిలో ఉన్నందున అనుమతులు రావడం లేదని సాక్షాత్తు అధికారులు వెల్లడించడం గమనార్హం.

ఆర్టీఐ చట్టం ఆన్‌లైన్‌ కావాలి: -కె.శివసాయి, నల్గొండ


రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుల స్వీకరణకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయాలి. ఆన్‌లైన్‌ సదు పాయం లేకపోవడం వలన పారదర్శకత లోపించడంతోపాటు దరఖాస్తుకు కనీసం రూ.100ఖర్చు అవ్ఞతుంది. దీంతో చట్టం వినియోగానికి పూర్తిగానోచుకోలేకపోతుంది.కేంద్రప్రభుత్వ శాఖ లకు సంబంధించి ఆన్‌లైన్‌ అవకాశం ఉండటంతో దరఖాస్తు ఏ దశలో ఉన్నది మొదలగు వివరాలు వాస్తవ సమయంలో తెలుసుకునేందుకు వీలు ఉంది.

నైతిక విలువలను పెంపొందించాలి: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ


తెలంగాణ రాష్ట్రంలో నైతిక విలువలతో కూడిన విద్య అందు బాటులోకి తెస్తామనిముఖ్యమంత్రి ఇటీవలప్రకటించడం ముదా వహం.సమాజంలోఅరాచకాలు,అశాంతి, ఆందోళనలు తగ్గేందు కు ప్రతి ఒక్కరిలో ముఖ్యంగా యువతలో నైతిక విలువలు పెంపొందించడం అత్యవశ్యకం. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తీరు సక్రమంగా లేదు. ఉపాధ్యాయులు బోధన తప్ప ఇతర పనులు చేయకూడదన్న నిబంధన ఉన్నా తగినంత బోధనేతర సిబ్బంది లేని కారణంగా బోధనతోపాటు అటెండరు పనులు కూడా చేయాల్సివస్తోంది.ఇందువలన బోధ నపై వారు దృష్టిసారించలేకపోతున్నారు.రాష్ట్రంలో చివరిసారిగా ప్రభుత్వ పాఠశాలలో నియామకాలు 1984 సంవత్సరంలో జరిగాయి.అప్పటి నుండి సర్వీసులో ఉన్నవారు మరణిస్తే వారి కుటుంబ సభ్యులను కారుణ్య నియామకాల ద్వారా నియమిం చడం తప్ప కొత్త నియామకాలు ఇప్పటివరకు జరపకపోవడం బాధాకరం.కాంట్రాక్టు పద్ధతినపనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరిం చాలన్న డిమాండ్‌కు కూడా ప్రభుత్వం స్పందించడం లేదు.

కాలుష్యాన్ని నివారించాలి:-జి.సతీష్‌కుమార్‌, హైదరాబాద్‌


గాలిలో వివిధ రసాయనాల శాతాన్ని బట్టి (ఏక్యూఐ) వాయు నాణ్యతా సూచిని లెక్కిస్తారు. ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరితంగా ఉన్నది. మొత్తం 549 శాతంగా ఉన్నట్లు ఏ క్యూఐ సూచి తెలిపింది. కాబట్టి ఇది చాలా ప్రమాకరం. ఇది ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత ఇలానే ఉంటుంది. కానీ ఈసారి ఇంకా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.రానురాను హైద రాబాద్‌ కూడా ఇలానే అవ్ఞతుంది.కాబట్టి కాలుష్య నివారణ మండలి, ప్రభుత్వాలు, ప్రజలు అందరూ భాగస్వాములైతేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

యువకుల చేతుల్లో దేశభవిష్యత్తు: -కె.నాగరాజు, విజయవాడ


ప్రస్తుతం యువత చాలావరకు తమ జీవితానికి గమ్యం లేకుం డా తిరుగుతున్నారు. జల్సాలకు,షికార్లకు బాగా అలవాటుపడి పోతున్నారు.యువత ఇలాగే తిరిగితే పెడదారి పట్టడానికి అవ కాశం ఉంది.యువతపై తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో దృష్టిపెట్ట వలసిన అవసరం ఉంది. ప్రభుత్వం యువకుల కోసం మాన సిక విశ్లేషకులతో ప్రేరణ తరగతులు నిర్వహించాలి. అలాగే యువకులు స్వయం ఉపాధితో జీవించే విధంగా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించాలి.ఉజ్వల దేశ భవిష్యత్తు యువకుల చేతుల్లో ఉందికాబట్టి వారు సన్మార్గంలో నడిస్తే బాగుంటుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/