విజయవంతమైన ఇస్రో జీశాట్‌-30

38 నిమిషాల్లోనే కక్ష్యలోకి ప్రవేశించిన ఉపగ్రహం

ISRO's GSAT-30 satellite
ISRO’s GSAT-30 satellite

బెంగళూరు: ఈ రోజు తెల్లవారుజామున భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన జీశాట్30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఇన్‌శాట్-4ఎ స్థానంలో సేవలు అందించేందుకు ఈ భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున 2:35 గంటలకు ఏరియన్5 రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ప్రయోగించిన 38 నిమిషాల్లోనే జీశాట్30 ఉపగ్రహం కక్ష్యలోకి చేరినట్టు ఇస్రో తెలిపింది. కమ్యూనికేషన్ ఉపగ్రహమైన దీని బరువు 3357 కిలోలు. దీని ద్వారా టెలికమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్, టెలివిజన్‌కు సంబంధించి మరింత మెరుగైన సేవలు లభించనున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/