కొత్త పాలక వర్గాలతోనైనా పట్టణ ప్రగతి జరిగేనా?

Town

రాష్ట్రంలో 33 జిల్లాల ఏర్పాటు వల్ల మండల కేంద్రాలు జిల్లా కేంద్రాలుగా మారటం, చిన్న పట్టణాలు, మున్సిపాలిటీలుగా మారటంతో ఎంతో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. కాని ఆస్తిపన్ను, ఇంటి పర్మిషన్‌ అనుమతుల ఖర్చులు రెట్టింపయ్యాయి. అవినీతి విశృంఖలంగా రాజ్యమేలుతుంది. ఇంటి అనుమతి, నల్లా అనుమతి, ఇంటి నెంబర్‌ కేటాయింపుకు వెలితే చాలు రసీదుకు సరిపడే విలువ మొత్తాన్ని అధికారులకు లంచంరూపంలో ఇవ్వాల్సిందే. ఇంటిపన్ను ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే అవకాశం చిన్న మున్సిపాలిటీలలో నేటికీలేదు. బహిరంగ వ్యాయామశాలలు, పబ్లిక్‌ పార్కులు కానరావ్ఞ. మటన్‌, ఫిష్‌, వెజిటెబుల్‌ మార్కెట్లు లేక రోడ్లపక్కన దుర్గంద వాతావరణంలో అమ్మకాలు చేస్తున్నారు.కొత్తపాలక వర్గాలు కొలువ్ఞతీరాకనైనా పట్టణాలప్రగతి సవ్యరీతిలో సాగుతుందని ఆశిద్దాం.

రా ష్ట్రంలోని 141 పట్టణ స్వపరిపాలనా సంస్థలలో 130 సంస్థలకు ఈ నెల 22న ఎన్నికలు జరగనున్న వేళ పట్టణ ప్రగతిపై ప్రతిచోట చర్చోపచర్చలు జరుగుతున్నాయి.మా హయాంలోనే ప్రగతి జరిగిందని అధికార ప్రతి పక్షాలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తుండగా ప్రజలు ఎవరికి పట్టం కడతారో ఈ నెల 25న తేలనుంది. 385 కార్పొరేటర్లు (10 కార్పొరేషన్లు) 2727 కౌన్సిలర్ల (120 మున్సిపాలిటీ)లకు జరుగుతున్న ప్రత్యక్ష ఎన్నికల్లో 53.37 లక్షల ఓటర్లు తీర్పు చెప్పనున్నారు. 1992లో పి.వి. నరసింహారావ్ఞ ప్రధానిగా ఉన్న కాలంలో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ స్వపరిపాలనా సంస్థలకు స్వయం ప్రతిపత్తిని కల్పించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండటం వల్ల నిధులు, విధులు కేటాయింపు, నియంత్రణ పూర్తిగా రాష్ట్రాల కనుసన్నల్లో జరుగుతుంది. రెగ్యు లర్‌గా ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి ఎన్నికలు నిర్వహించకపో వడం ప్రత్యేకాధికారుల పాలన, పురపాలిక, నగర పాలిక సంస్థ లకు పూర్తి అధికారాలను బదలాయించకపోవడం అరకొర నిధుల కేటాయింపు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులపై అధికంగా ఆధారపడటం, రాష్ట్రాల వాటాను సకాలంలో విడుదల చేయకపో వడం వంటి కారణాల వల్ల పట్టణ ప్రగతి నానాటికీ తీసికట్టు నాగంబొట్టు అన్న చందంగా మారింది. ప్రజల ముక్కుపిండి ఇంటిపన్ను, ఆస్తి పన్ను అని వసూలు చేస్తున్న అవి ఉద్యోగాల జీతభత్యాలకు కూడా సరిపోక, అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. నేడు పట్టణాలు, నగరాలలో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. ఒకవైపు జనాభా, వలసలు వేగంగా పెరుగుతున్నా తదనుగుణంగా పట్టణాలలో మౌలిక సౌకర్యాలు విస్తరించడం లేదు. ఇంటి అనుమతులు ఇచ్చి ఖజానా నింపుకుంటున్న అధికారులు, పాలకవర్గాలు ఏళ్లు గడిచాక కూడా ఆ ఇళ్లముందుకు కరెంటు స్తంభాలు, డ్రైనేజీ, మంచినీరు వంటి కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమవ్ఞతున్నారు. దురదృష్టవశాత్తు 2019 కొత్త మున్సిపల్‌ చట్టం కూడా నిర్ణీత కాలవ్యవధిలో అనుమతి పొందిన ఇంటికి ఈ నాలుగు మౌలిక వసతులు కల్పిస్తామన్న హామీ ఇవ్వడం లేదు. ఇల్లు కట్టుకున్న వారే స్తంభాలేసుకోవాలి. రోడ్డుమొరం పోయించుకోవాలి. నల్లా ఫీజుకట్టి మరి పైపులైను కోసం సొంత ఖర్చుతో తవ్ఞ్వకోవాలి. డ్రైనేజీకి ఏర్పాటు చేసుకోవాలి. తీరా అన్ని చేసుకున్నాక నాలుగు, ఐదు సంవత్సరాలకు అధికారులు అనుమతులివ్వడం కాంట్రాక్టర్ల జేబులు నిండడం రివాజుగా మారింది. పట్టణాలు, నగరాల పరి స్థితి పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న తీరును తలపిస్తుంది.ఏ మున్సి పాలిటీ, కార్పొరేషన్‌ చూసినా ఒకే రీతి సమస్యలు దర్శనమిస్తు న్నాయి. అస్తవ్యస్థమైన రహదారులు, ఇరుకు సందులు, గుంతల మయమైన రోడ్లు, శిధిలమైన మురుగు నీటికాలువలు, 2,3 నెలలకోమారు కూడా శుభ్రం చేయని నిల్వఉంటున్న డ్రైనేజీ కాలువలు, పూర్తికాని మిషన్‌ భగీరథ పైపులైను వ్యవస్థ, పూడ్చని గుంటలు, దీపాలు లేని ఉన్నా వెలగని వీధులు, నల్లా ఎప్పుడు వస్తుందో, ఎంతసేపు వస్తుందో తెలియని పరిస్థితి. వీధి కుక్కలు, పందులు, దోమల స్వైర విహారం, మంచినీటి కోసం రోజుకు 50 నుంచి వంద ఖర్చు చేయాల్సిన పరిస్థితి. బాగు చేయని మున్సి పల్‌ బోర్లు, ట్యాంకర్లతో నీరు తెప్పించుకుంటున్న జనం.ఇంటింటి నుండి చెత్త సేకరణలో జాప్యం, శివారు కాలనీలకు వెళ్లే దారులు లేకపోవడం వంటి అనేక సమస్యలు దర్శనమిస్తాయి. ఇవేగాక అక్రమ వెంచర్లు, డంపింగ్‌ యార్డులు, సిసిరోడ్ల కొరత, పార్కు లు, వినోద సదుపాయాలు లేకపోవడం, వీధులు, రోడ్ల సూచిక బోర్డులు లేకపోవడం, అంతర్గత రోడ్ల కిరువైపులు పండ్ల, పూల చెట్ల కొరత, అక్రమ కట్టడాల సమస్య, ఎలాంటి ప్రణాళిక లేని పట్టణ, నగరాల విస్తరణ, మురికివాడల విస్తరణ, పెరుగుతున్న నేరాలు, డ్రగ్స్‌, పబ్‌కల్చర్‌ పెరగడం, యువతలో మత్తు వినియోగం పెరగడం, ట్రాఫిక్‌ రద్దీ, కాలుష్యం విస్తరణ, లైంగిక విశృంఖలతను పెంచుతున్న సినిమాల ప్రదర్శన, కేఫ్‌లు, నియంత్రణలేని కబేళాలు వంటి ఇతర సమస్యలు కూడా నిత్యం దర్శనమిస్తున్నాయి. 1678లో మద్రాస్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుతో ప్రారంభమైన పట్టణ స్వపరిపాలన 1882 నాటికి రిప్పన్‌ కాలంలో బాగా విస్తరించింది. 12వ షెడ్యూల్‌లోని 243(డబ్ల్యు)లో పేర్కొన్న 18 అధికారాలు, విధులను బీహార్‌, గుజరాత్‌ లాంటి రాష్ట్రాలు ఇప్పటికే పట్టణ సంస్థలకు బదలా యించి పరిపుష్టం చేశాయి. తాజాగా తెలంగాణ మున్సిపల్‌ చట్టం-2019 ప్రతి పట్టణంలో పది శాతం నిధులతో గ్రీన్‌ బడ్జెట్‌, ప్రతి జిల్లాలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో గ్రీన్‌సెల్‌ల ఏర్పాటు, ఐదు సంవత్సరాల కోసం గ్రీన్‌ కార్యాచరణ ప్రణాళిక, ప్రతి ఇంటికి నర్సరీల ద్వారా ఉచితంగా మొక్కల అందచేత, 85శాతం మొక్కలు బతికేలా చేసే బాధ్యతను కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై పెట్టడం, సరైన పనితీరు కనపర్చని ఛైర్మన్‌, మేయర్‌లను తొల గించే నిబంధనలను చేర్చడం, ప్రగతి నివేదికలను నిర్ణీతకాలంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసే నిబంధన చేర్చడం వంటి పురోగామి చర్యలకు స్థానం కల్పించింది. రాష్ట్రంలో 33 జిల్లాల ఏర్పాటు వల్ల మండల కేంద్రాలు జిల్లా కేంద్రాలుగా మారటం చిన్న పట్టణాలు, మున్సిపాలిటీలుగా మారటంతో ఎంతో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. కాని ఆస్తిపన్ను, ఇంటి పర్మిషన్‌ అనుమతుల ఖర్చులు రెట్టింపయ్యాయి. అవినీతి విశృంఖలంగా రాజ్యమేలుతుంది. ఇంటి అనుమతి, నల్లా అనుమతి, ఇంటి నెంబర్‌ కేటాయింపుకు వెలితే చాలు. రసీదుకు సరిపడే విలువ మొత్తాన్ని అధికారులకు లంచం రూపంలో ఇవ్వాల్సిందే. ఇంటి పన్ను ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే అవకాశం చిన్న మున్సిపాలిటీలలో నేటికీ లేదు. బహిరంగ వ్యాయామ శాలలు, పబ్లిక్‌ పార్కులు కానరావ్ఞ. మటన్‌, ఫిష్‌, వెజిటెబుల్‌ మార్కెట్లు లేక రోడ్లపక్కన దుర్గంద వాతావరణంలో అమ్మకాలు చేస్తున్నారు. కొత్తపాలక వర్గాలు కొలువ్ఞ తీరాకనైనా పట్టణాల ప్రగతి సవ్యరీతిలో సాగుతుందని ఆశిద్దాం.

  • తండ ప్రభాకర్‌ గౌడ్‌

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/