రోడ్డు ప్రమాదాలను అరికట్టేదెలా?
కఠినమైన చట్టాలు అత్యవసరం

రాష్ట్రంలో వరుస ప్రమమాదాలతో రోడ్లు నెత్తురోడ్డు తున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట రహదారులపై ఎందరో ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులు కావడం జరుగుతున్నది. ప్రభుత్వ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గడం లేదు. అతివేగం, డ్రైవింగ్, నిర్లక్ష్యం వల్ల వేలాది మంది బతుకులు గాలిలో కలిసిపోతున్నాయి.
రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మలుపుల వద్ద జరుగుతున్నాయి. ఇరుకురోడ్లు,వంతెనలను బ్లాక్ స్పాట్ లుగా గుర్తించి ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టినా ఆశించిన మార్పు కనిపించడం లేదు.
ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. 2019లో రోడ్డు ప్రమాదాలవల్ల 6,946 మంది మృతిచెందగా, 21,999 మంది గాయపడ్డారు. 2020 జూన్ 30 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 8,712 రోడ్డు ప్రమాదాలు జర గగా 2,592మంది మృతిచెందితే 9,173 మంది గాయ పడ్డారు.
ఈ ఏడాది రాష్ట్రంలో కరోనా మృతుల కంటే ప్రమాదపు మృతులే ఎక్కువగా ఉన్నాయి. అంటే పరిస్థితు లను అర్థం చేసుకోవచ్చు.లాక్‌డౌన్ సమయంలో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా రోడ్డుప్రమాదాలు భారీగా తగ్గాయి. జనవరి నుంచి జూన్‌వరకు దేశంలో 35శాతం రోడ్డు ప్రమా దాలు తగ్గినట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. 2019 తొలి ఆర్నెలల్లో మృతుల సంఖ్య 79,678 నమోదుకాగా, 2020 తొలి ఆర్నెలల్లో 56,288 మంది మృతిచెందారు.
ఈ మధ్య ప్రమాదాలకు సంబంధించిన వార్తలేకుండా పత్రికలేదంటే అతిశయోక్తి లేదు. ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రమాదాలు జరిగి ప్రాణాలను కోల్పోవడం ప్రతిఒక్కరు చూస్తూనే ఉంటా రు.ఇలాంటి రోడ్డు ప్రమాదాలను అరికట్టవలసిన అవశ్యకత ఎంతైనా ఉన్నది.
ఏదైనా ఒక కుటుంబంలో ఎవరైనా ఇలాంటి ప్రమాదాల బారినపడి మరణిస్తే ఆ కుటుంబం అంతా మాన సికంగా,ఆర్థికంగా వెనుకబడి రోడ్డునపడాల్సినంతపనవుతుంది.
రెప్పపాటు వ్యవధిలో జరిగే ఇలాంటి ప్రమాదాల గురించి సమగ్రంగా అధ్యయనం చేసి, విశ్లేషించి దానికిగల కారణాలను కనుక్కొని అరికట్టడానికిగల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉన్నది. అలాగే వాహనదారులు సైతం ఎంతో జాగ్రత్తవహించాల్సిన అవసరం ఉన్నది
ప్రస్తుతం సమాజంలో ప్రతి కుటుంబంలో ఏదో ఒకవాహనం లేకుండా ఉండ లేనిపరిస్థితి.గతంలో సైకిళ్ల మాదిరిగా ఆర్థిక స్తోమతకనుగుణంగా ద్విచక్రవాహనాలు వాడటం జరుగుతుంది. అది కూడా ఒక నిత్యావసర వస్తువ్ఞగా మారిందని చెప్పవచ్చు.
ఆర్థికంగా కొంత మెరుగ్గా ఉన్నవారి ఇంట్లో ఎంతమంది యువకులు ఉంటే అన్ని వాహనాలు.అలాగే పట్టణాలు, నగరాలలో ఉన్న ధనవం తుల ఇళ్లలో ఎలాంటి వాహనాలు ఉంటాయో అందరికీ తెలి సిందే. మారుతున్న కాలానికనుగుణంగా ఎవరికివారు వారి పనుల నిమిత్తం పలురకాల వాహనాలను ఉపయోగించుకోవ డం జరుగుతుంది.
అలాగే గతంతో పోలిస్తే రహదారులు సైతం పెద్దవై వేగాన్ని నిరోధించకుండా మారి, నడుపుతున్న సమయంలో ఒక్క క్షణం అజాగ్రత్త వహించిన ప్రమాదాల బారినపడక తప్పనిపరిస్థితి నెలకొంది. రోడ్డు ప్రమాదాలనేవి చాలా రకాలుగా జరుగుతున్నాయి.
అజాగ్రత్త వహించడం, మద్యంమత్తులో వాహనాలు నడపడం, అతివేగం వలన శీతా కాలంలో ఏర్పడే మంచువలన రహదారులు సరిగ్గా కనబడక పోవడం,తెల్లవారుజామున నిద్రమత్తులో వాహనాలు నడపడం, అనుకోకుండా ఏదైనా అకస్మాత్తుగా వాహనాలకు అడ్డురావడం, రోడ్డు భద్రత విద్యకు సంబంధించిన జ్ఞానంలేకపోవడం, అను కోకుండా వాహనంలో ఏవైనా సమస్యలు ఏర్పడటం, రహదా రులు సక్రమంగా ఉండకపోవడం లాంటి కారణాలవలన ప్రమాదాలు జరిగితే, ఒక్కొక్కసారి ఎదుటివాహనం అజాగ్రత్త కారణంగా ప్రమాదాలబారినపడి ప్రాణాలు కోల్పోయిన సంఘ టనలు సైతం జరగడం అందరికీ తెలిసిందే.
మన రాష్ట్రంలో చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖుల కుమారులు,రాజకీయ నాయకుల పుత్రసంతానం రోడ్డుప్రమాదంలో చనిపోయిన ప్పుడు ఎంతో చర్చ జరిగి, త్వరలోనే ప్రమాదాన్ని అరికట్టే చర్యలను తెలిపేవారు. కానీ ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లు మళ్లి జరుగుతూనే ఉన్నాయి.
సెలబ్రిటీ కుటుంబాలకు చెందిన వారెందరో ప్రమాదాలకు గురవ్ఞతున్నా మనకి తెలియకపో వచ్చు. ఎందుకంటే వారికంతా ప్రాధాన్యత సంతరించుకోదు. ఏదిఏమైనా ప్రాణం విలువ వెలకట్టలేనిది. తల్లిదండ్రుల పుత్ర శోకాన్ని ఎవరు తగ్గించలేరు.
వారి కుటుంబంలోటును ఎవరు పూడ్చలేరు.ఉదయం ఇంటి నుండి బయలుదేరామా? సాయం కాలం ఇంటికెళ్లేదాకా మనిషి జీవితానికి భద్రతలేకుండా పోయింది. రోడ్డు ప్రమాదంలో ఒక్కొక్కసారి ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా మృత్యువు ఏ సమయంలో ఎలా వస్తుందో తెలియని పరిస్థితి.
కేవలం వాహనదారులే ప్రమాదాలకు గురి కాకుండా ఒక్కొక్కసారి అమాయక పాదాచారుల ప్రాణాలు వాహనాలకు బలైపోవడం చూస్తుంటాం. ముగ్గురు ఎక్కే ఆటో లో పదిమందిని ఎక్కించడం, ఇద్దరెక్కే మోటార్ సైకిలుపై ఐదారుగురు ఎక్కడం, హెల్మెంట్, సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం, రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడం, తాగి వాహనం నడపడం, మొబైల్‌లలో మాట్లాడుతూ వాహనం నడపడం, అస్తవ్యస్థమైన రోడ్లు, ఇలాంటి సందర్భాలలో ప్రమాదాలకు గురి కావాల్సి వస్తుంది.
రోడ్డు ప్రమాదాలకు గురై ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రమాదాలు ఎక్కువగా విశాలమైన నాలుగు మార్గాల రోడ్డు, ఔటర్ రింగు రోడ్డులపై ఎక్కువగా జరుగుతుంటాయి. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పురస్కరించుకోని శాస్త్రవేత్తలు ఎన్నో రకాలైన వాహనాలు కనిపెడుతూ తయారు చేస్తుంటారు.లక్షలు, లక్షలు పెట్టి వాహనాలు తీసుకొని నిదానంగా వెళ్లకుండా అతివేగంతో వెళ్లి రెప్పపాటు క్షణంలో నియంత్రణ కోల్పోయి, ఏం జరుగుతుందో అని ఆలోచించకముందే ప్రాణాలను కోల్పోయే ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రమాదాలు జరగడంలో అతివేగం ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నదో మద్యం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉన్నది.ఇంకొన్ని ప్రమాదాలు మద్యంమత్తు లో వాహనాలను నడుపుతూ విచక్షణాజ్ఞానాన్ని కోల్పోయి ప్రమాదాలబారిన పడుతుంటారు. కొన్ని సర్వేలను పరిశీలిస్తే ప్రమాదాలలో ప్రాణాలను కోల్పోయినవారిలో అత్యధికం యువతే ఉండటం బాధాకరం.
నేటి ఆధునికయుగంలో అభి వృద్ధి చెందుతున్న శాస్త్రసాంకేతిక రంగాన్ని ఉపయోగించు కుంటూ ప్రపంచంలో ఏమూలాన ఏం జరిగిన క్షణంలో తెలిసిపోతుంది. ప్రత్యేకంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జాతీయ రహదారులపైననే జరుగుతుంటాయి. అస్తవ్యస్తమైన రోడ్లవల్లకావొచ్చు.
ఘాట్‌రోడ్డులు ఎక్కువగా ఉండటం, అదే విధంగా అతివేగం, రహదారులు వంకరటింకరగా వ్ఞంటూ ఎలాంటి ప్రమాదనివారణ బోర్డులు లేకపోవడం వలన కూడా ఇలాంటి ప్రమాదాలుజరిగే అవకాశమున్నది. ప్రభుత్వం ప్రమాదాల నివారణకు కఠినమైన చట్టాలను వినియోగించాలి.
డ్రైవర్ల కు లైసెన్సుజారీ చేసేటప్పుడు ప్రభుత్వం అమలుపరిచే చట్టాలపై అవగాహన కల్పించాలి. వారందరికీ సూచనలిస్తూ, చట్టా లను అత్రికమిస్తే జరిగేనష్టాన్ని ముందుగానే తెలియచేయాలి.
రోడ్డుభద్రత అధికారులు రోడ్లను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎప్ప టికప్పుడు మరమ్మతులు చేయిస్తుండాలి.
- డా.పోలం సైదులు
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/