కరోనా ఎఫెక్ట్‌..రాష్ట్రపతి భవన్ సందర్శన నిలిపివేత

ట్విట్టర్ లో ప్రకటించిన భవన్ వర్గాలు

Rashtrapathi Bhavan
Rashtrapathi Bhavan

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సందర్శనను అధికారులు నిలిపివేశారు. భవన్ సందర్శనకు ఎవరూ రావద్దని, చూసేందుకు అనుమతించమని భవన్ అధికారులు ట్విట్టర్‌లో ప్రకటించారు. ఇప్పటికే ప్రఖ్యాత మొఘల్ గార్డెన్స్ సందర్శనను నిలిపివేసిన అధికారులు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘కోవిడ్ 19 భయపెడుతోంది. వ్యాధి విస్తరణను అడ్డుకునేందుకు ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని అధికారులు ట్వీట్ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు రాష్ట్రపతి భవన్ మ్యూజియం సముదాయం (ఆర్‌బీఎంసీ), చేంజ్ ఆఫ్ గార్డ్ వేడుకలకు కూడా సందర్శకులను అనుమతించరాదని నిర్ణయించారు.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/