టీ కాంగ్రెస్ లో అసమ్మతి సెగ ..విష్ణువర్ధన్ పార్టీకి రాజీనామా..?

టి కాంగ్రెస్ లో మరోసారి అసమ్మతి సెగ మొదలైంది. నిన్న శుక్రవారం 45 మందితో కూడిన రెండో లిస్ట్ ను అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది టికెట్ ఆశించిన వారికీ టికెట్ ఇవ్వకపోవడం తో వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు లో కోమటిరెడ్డి రాజగోపాల్ కు టికెట్ ఇవ్వడం పట్ల అక్కడి నేత కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ..రాజగోపాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెపుతున్నారు.

అలాగే జూబ్లీహిల్స్ టికెట్ తనకు కాకుండా అజారుద్దీన్ కు ఇవ్వడం పట్ల విష్ణు వర్ధన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ కి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నాడు. తమ కార్యకర్తలతో చర్చలు జరిపి తదుపరి నిర్ణయం తీసుకున్నానని చెపుతున్నాడు. అలాగే మరికొంతమంది సైతం టికెట్ ఆశించి భంగపడ్డారు. వీరంతా పార్టీ లో ఉంటారా..? లేక మరో పార్టీ లో చేరతారా అనేది చూడాలి.

ఇక రెండో జాబితా అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

సిర్పూర్: రావి శ్రీనివాస్
అసిఫాబాద్ (ఎస్టీ): అజ్మీరా శ్యామ్
ఖానాపూర్ (ఎస్టీ): వెద్మర బొజ్జు
ఆదిలాబాద్: కంది శ్రీనివాస్ రెడ్డి
బోథ్ (ఎస్టీ): వెన్నెల అశోక్
ముథోల్: బోస్లె నారాయణరావు పాటిల్

ఎల్లారెడ్డి: కే మదన్ మోహన్ రావు
నిజామాబాద్ రూరల్: డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి
కోరుట్ల: జువ్వాది నర్సింగరావు
చొప్పదండి (ఎస్సీ): మేడిపల్లి సత్యం
హుజూరాబాద్: వడితెల ప్రణవ్

హుస్నాబాద్: పొన్నం ప్రభాకర్
సిద్దిపేట: పూజల హరికృష్ణ
నర్సాపూర్: ఆవుల రాజిరెడ్డి
దుబ్బాక: చెరుకు శ్రీనివాస్ రెడ్డి
కూకట్‌పల్లి: బండి రమేష్

ఇబ్రహీంపట్నం: మల్ రెడ్డి రంగారెడ్డి
ఎల్బీనగర్: మధుయాష్కి గౌడ్
మహేశ్వరం: కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
రాజేంద్రనగర్: కస్తూరి నరేందర్
శేరిలింగంపల్లి: వీ జగదీశ్వర్ గౌడ్

తాండూర్: బయ్యని మనోహర్ రెడ్డి
అంబర్‌పేట్: రోహిన్ రెడ్డి
ఖైరతాబాద్: పీ విజయారెడ్డి
జూబ్లీహిల్స్: మహ్మద్ అజహరుద్దీన్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ): డాక్టర్ జీవీ వెన్నెల

నారాయణపేట్: డా. పర్ణిక చిట్టెం రెడ్డి
మహబూబ్ నగర్: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
జడ్చర్ల: జే అనిరుధ్ రెడ్డి
దేవరకద్ర: గావినోళ్ల మధుసూధన్ రెడ్డి
మక్తల్: వాకిటి శ్రీహరి

వనపర్తి: డా. జిల్లెల చిన్నారెడ్డి
దేరకొండ (ఎస్టీ): నేనావత్ బాలూ నాయక్
మునుగోడు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
భువనగిరి: కుంభం అనిల్ కుమార్ రెడ్డి
జనగామ: కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

పాలకుర్తి: యశశ్విని
మహబూబాబాద్ (ఎస్టీ): డా. మురళీ నాయక్
పరకాల: రేవూరి ప్రకాశ్ రెడ్డి
వరంగల్ పశ్చిమ: నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ తూర్పు: కొండా సురేఖ

వర్ధన్నపేట (ఎస్సీ): కేఆర్ నాగరాజు
పినపాక (ఎస్టీ): పాయం వెంకటేశ్వర్లు
ఖమ్మ: తుమ్మల నాగేశ్వరరావు
పాలేరు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.