ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన విష్ణు..

తెలంగాణ కాంగ్రెస్‌లో సీట్ల కేటాయింపుపై సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్నా వారిని కాదని..ఒకటి , రెండ్రోజుల క్రితం పార్టీలో చేరిన వారికి టికెట్‌లు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా వరుస పెట్టి పార్టీ కి రాజీనామా చేసి , బిఆర్ఎస్ లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా..తాజాగా PJR తనయుడు విష్ణువర్ధన్ సైతం బిఆర్ఎస్ లోకి చేరబోతున్నట్లు తెలుస్తుంది.

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ను విష్ణు ఆశించగా..అధిష్టానం విష్ణు కు కాకుండా అజారుద్దీన్ కు ఇచ్చింది. దీంతో అధిష్టానం ఫై అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇదే క్రమంలో విష్ణు అనుచరులు గాంధీ భవన్ ముట్టడికి ట్రై చేసారు. పెద్ద ఎత్తున గాంధీ భవన్ లోకిని వెళ్లేందుకు ట్రై చేయగా..గేటుకు తాళం వేసి ఉండడం తో రాళ్లతో దాడి చేసారు. నిన్న సాయంత్రం విష్ణు..ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. మరి విష్ణు బిఆర్ఎస్ లో చేరతారా..? లేదా అనేది చూడాలి.

2009 ఎన్నికల్లో జుబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విష్ణువర్ధన్ రెడ్డి.. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటమి పాలయ్యారు. ఆయన సోదరి పీ విజయా రెడ్డి 2014 ఎన్నికల్లో ఖైరతాబాద్ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి రెండు దఫాలు ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. కానీ, గతేడాది కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయారెడ్డికి ఖైరతాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది.