” వాట్ అమ్మ… వాట్ ఇస్ దిస్ అమ్మా ” అంటూ విష్ణు కు..మనోజ్ కౌంటర్

మా ఎలక్షన్స్ ప్రచారం నిన్నటి వరకు ఎంత ఉత్కంఠ గా సాగిందో తెలియంది కాదు..నువ్వా నేనా అన్నట్లు ఇరు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఇక ఈరోజు పోలింగ్ లో మాత్రం ఇరు సభ్యులు చాల ప్రశాంతంగా ఉన్నారు. ఈ క్రమంలో మంచు విష్ణు ఫై కౌంటర్ వేసాడు ఆయన తమ్ముడు మనోజ్. ఎన్నికల పోలింగ్ జరిగిన కేంద్రంలో… మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజ్ సరదాగా ఓ సెల్ఫీ దిగారు. అయితే ఆ సెల్ఫీ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఆ ఫోటో ను మంచు విష్ణు తమ్ముడు మనోజ్…ట్విట్టర్ లో షేర్ చేసి ” వాట్ అమ్మ… వాట్ ఇస్ దిస్ అమ్మా ” అంటూ క్యాప్షన్ పెట్టి చేశాడు. ఆ ఫోటో లో ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు పోలింగ్ కేంద్రం దగ్గర కలిసి హ్యాపీగా ఉన్న ఫోజ్ లో మనకు కనిపిస్తారు. ఈ ఫోటోను మంచు మనోజ్ షేర్ చేయడంతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

What ammaaaa what is this ammmaaaa ?!:) 😜 pic.twitter.com/41gAotPHJD— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 10, 2021