కరోనా బారిన పడిన అఖండ హీరోయిన్..టెన్షన్లో యూనిట్

కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా తగ్గలేదు..భారీగా కాకపోయినా వందల సంఖ్య లో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇక చిత్రసీమ ను మాత్రం కరోనా మహమ్మారి వణికించిన సంగతి తెలిసిందే. ఎంతమంది కరోనా మహమ్మారికి బలి కాగా..మరికొంతమంది క్షేమంగా బయటపడ్డారు. తాజాగా అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కరోనా బారిన పడినట్లు స్వయంగా వెల్లడించింది.

‘పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకున్నాక కూడా నేను కరోనా బారిన పడ్డాను. గతంలో కూడా నాకు వైరస్ సోకింది. దీంతో అన్ని నిబంధనలు పాటిస్తూ.. నేను ఐసోలేషన్‌లోకి వెళ్లాను. గత పది రోజులుగా నన్ను కలిసిన వాళ్లు దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ ప్రగ్యా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. మొన్నటి వరకు కూడా ఈమె అఖండ చిత్ర బృందం తో కలిసి ఉంది. దీంతో చిత్ర యూనిట్ ఖంగారు పడుతున్నారు.

బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ మూవీ తెరకెక్కింది. ద్వారక క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్‌గా నటిస్తుండగా.. పూర్ణ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. View this post on Instagram

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)