మా ఎలక్షన్స్: బెనర్జీ ఫై మోహన్ బాబు ఆగ్రహం ..చంపేస్తానంటూ బెదిరింపు

ఉదయం నుండి ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్..అరగంట నుండి రసాభాస గా మారింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ ఫై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. నటుడు బెనర్జీ ఫై ఫైర్ అయ్యారు. పోలింగ్ లో తేడాలు వస్తే చంపేస్తానని బెదిరించారు. దీనిపై ఎన్నికల అధికారి సైతం సీరియస్ అయ్యారు. ఇలాగే కొనసాగితే పోలింగ్ ను రద్దు చేస్తామని హెచ్చరించారు.

మెగా ఫ్యామిలీ సపోర్ట్ అంటే చిరంజీవి ఏమన్నారంటే…

మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఎవరికీ అని మీడియా అడిగిన ప్రశ్న కు చిరంజీవి తనదైన స్టయిల్ లో సమాధానం చెప్పారు. కళాకారులు ఎవరికైతే మద్దతు ఇచ్చారో వారికే నా సపోర్ట్ అని అన్నారు. ఇప్పుడు ఉన్నట్లు అన్ని సార్లు మా ఎన్నికలు ఇలా ఉండవు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరుగుతున్నాయి.

పోలింగ్ బూత్ కు చేరుకున్న చిరంజీవి. మా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు సినీ నటి నటులు పోటీ పడుతున్నారు. ఉదయం 8 గంటల నుండే ప్రముఖులు విచ్చారు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మంచు ఫ్యామిలీ మొదలగు వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు.’

మా’ పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు పోలింగ్ బూత్ లో ప్రచారం చేస్తున్నారని విష్ణు ప్యానల్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుడు శివారెడ్డి..లోపల ప్రచారం చేస్తుండడం తో విష్ణు ప్యానల్ సభ్యుడు శివ బాలాజీ అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య దూషణలు మొదలైంది. పోలీసులు వచ్చి వారిని అక్కడి నుండి పంపించారు.

మా ఎన్నికల పోలింగ్ మొదలైంది. జూబ్లీ పబ్లిక్ స్కూల్ లో పోలింగ్ జరుగుతుండగా సినీ తారలు ఒక్కొక్కరిగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బూతు కు వస్తున్నారు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ పోలింగ్ బూత్ కు చేరుకోగానే మీడియా చుట్టుముట్టింది. ఈ సందర్బంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు పవన్ సమాదానాలు చెప్పారు. ఇండస్ట్రీ ఎప్పుడు రెండుగా చీలి పోదని , మోహన్ బాబు – చిరంజీవి లు బెస్ట్ ఫ్రెండ్స్ ఈ ఎన్నికల వల్ల విడిపోరని స్పష్టం చేసారు. ఈ ఎన్నికలు చాల సున్నితంగా , ఏకగ్రీవంగా జరగాల్సింది. సినిమాలు చేసేవారు ఆదర్శంగా ఉండాలి తప్ప ఇలా వ్యక్తిగతంగా దూషణలు చేసుకోకూడదు. మా ఎన్నికల్లో ఇప్పటి వరకు ఇంత హడావిడి కనిపించలేదు. మా సభ్యుల్లో చీలిక రాదు. ఇక మీ ఓటు ఎవరికీ అంటే మాత్రం అది ఎలా బయటకు చెపుతాం..చెప్పకూడదు కదా అని సమాధానం చెప్పారు.

ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈసారి ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. దీంతో మా అధ్యక్షుడిగా ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఈసారి మా ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాశ్​రాజ్ అధ్యక్ష పోటీ చేస్తున్నారు. మా అసోసియేషన్ లోని 26 మంది కార్యవర్గం కోసం 54 మంది అభ్యర్థులు పోటీ గా నిలిచారు. ఇందులో గెలిచిన అభ్యర్థులు 2021-23 సంవత్సరానికిగానూ ‘మా’ లో బాధ్యతలు నిర్వర్తిస్తారు.