‘విరూపాక్ష’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్!

సాయి ధరమ్ తేజ్ – సంయుక్త జంటగా కార్తీక వర్మ దండు డైరెక్షన్లో సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం విరూపాక్ష . ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో మేకర్స్ చిత్రంలోని కలల్లో అనే లిరికల్ మెలోడీ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ మెలోడి సాంగ్ కి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.

ఇదిలా ఉంటె రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసారు మేకర్స్. సినిమాను చూసిన సెన్సార్ బోర్డు (CBFC) A సర్టిఫికెట్ (A Certificate) జారీ చేసారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజ‌య్‌, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్సిడెంట్‌లో గాయపడి కోలుకున్న తర్వాత సాయిధరమ్ నుంచి వస్తున్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లోనూ అంచనాలున్నాయి. అలాగే తన కెరీర్‌కు కూడా సాలిడ్ హిట్ పడాల్సిన అవసరముంది. మరోవైపు తేజ్ సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతమ్‌ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ ఓ కీలక రోల్ చేస్తుండడం విశేషం. జులై 28 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

YouTube video