బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తున్న విరూపాక్ష

Virupaksha Movie Talk ..

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ – సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో వచ్చిన విరూపాక్ష మూవీ సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఆక్సిడెంట్ తర్వాత చాల గ్యాప్ తీసుకొని తేజ్ చేసిన సినిమా కావడం , టీజర్ , ట్రైలర్ ఆసక్తి గా ఉండడం , సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం తో సినిమా ఫై అంచనాలు పెరిగాయి. ఆ అంచలనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండడం తో ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు.

తొలిరోజు రూ. 12 కోట్లు కలెక్షన్స్ రాబట్టగా.. రెండో రోజు ఆ నంబర్ ఇంకాస్త పెరిగింది. వీకెండ్ కావడంతో శనివారం ఏకంగా రూ.16 కోట్ల వరకు వచ్చాయి.

రెండు రోజుల్లో ఏరియా వైజ్ కలెక్షన్స్ చూస్తే..

నైజాంలో రూ. 4.53 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.43 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.33 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 75 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 66 లక్షలు, గుంటూరులో రూ. 81 లక్షలు, కృష్ణాలో రూ. 70 లక్షలు, నెల్లూరులో రూ. 38 లక్షలతో కలిపి.. రూ. 10.59 కోట్లు షేర్, రూ. 18.20 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 85 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.21 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల్లోనే రూ. 13.65 కోట్లు షేర్‌, రూ. 24.60 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.