వ్యాక్సిన్ తర్వాత ఆస్పత్రి పాలైన ఆశావర్కర్ మృతి

గుంటూరు జిజిహెచ్ లో విషాదం

Ashaworker, who was hospitalized after the vaccine, died
Ashaworker, who was hospitalized after the vaccine, died

Guntur: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఫ్రంట్ లైన్ వారియర్ విజయలక్ష్మి ఆదివారం గుంటూరు జీజీహెచ్ లో మృతి చెందింది. ఈనెల 21 వ తేదీన అపస్మారక స్థితిలో గుంటూరు జీజీహెచ్ లో చేరిన విజయలక్ష్మి చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.

రాజధాని ప్రాంతంలోని పెనుమాక గ్రామంలో విజయలక్ష్మి ఆశా వర్కర్ గా పనిచేస్తోంది. ఈనెల 19 వ తేదీన విజయలక్ష్మి కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం రెండు రోజుల పాటు బాగానే వున్న విజయలక్ష్మికి 21 వ తేదీన అకస్మాత్తుగా చలిజ్వరం వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది.

వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గుంటూరు జీజీహెచ్ లో అత్యవసర వైద్య విభాగంలో మూడురోజుల పాటు వైద్యులు ఆమెకు చికిత్స అందించినా ఫలించక పోవటంతో మృతి చెందింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/