అక్కడేం జరిగిందో పూర్తిగా తెలుసుకొని రావాలి

జర్నలిస్టుపై విరాట్ కోహ్లీ ఆగ్రహం

Virat-Kohli
Virat-Kohli

క్రైస్ట్‌చర్చ్‌: టీమిండియా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆగ్రహం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ ప్లేయర్లు ఔటైనప్పుడు గ్రౌండ్‌లో మీరు ప్రవర్తించిన తీరుపై మీ స్పందనేంటని, మైదానంలో సరిగ్గా ఉండాలని మీకు తెలియదా? అని ఓ విలేకరి ప్రశ్నించాడు. దీంతో దీనిపై మీరేమనుకుంటున్నారు? అన్నాడు. దీంతో కోహ్లీ నేనూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా? అని వాదించాడు. నేను కూడా మిమ్మల్నే జవాబు అడుగుతున్నానంటూ కోహ్లీ మాటకు మాట సమాధానం ఇచ్చాడు. మీరు మైదానంలో సరిగ్గా ప్రవర్తించాల్సిందని కోహ్లీని జర్నలిస్టు అన్నాడు. దీంతో కోహ్లీ స్పందిస్తూ అక్కడేం జరిగిందో పూర్తిగా తెలుసుకొని రావాలని, కొద్ది సమాచారంతో ఇక్కడకు వచ్చి మాట్లాడకూడదని కసురుకున్నాడు. ఒకవేళ వివాదాలు సృష్టించాలనుకున్నా, ఇది సరైన వేదిక కాదని చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై తాను ఇప్పటికే రిఫరీతో మాట్లాడానని, అక్కడేం జరిగిందనే దానిపై వారికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/