గుజరాత్ లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫై వాటర్ బాటిల్​తో దాడి

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ లో చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై గుర్తు తెలియని ఓ వ్యక్తి వాటర్ బాటిల్​ను విసిరాడు. ఆ బాటిల్ కేజ్రీవాల్ తలపై నుంచి వెళ్లి పక్కన పడటం వల్ల ఆయనకు గాయాలేం కాలేదు. గుజరాత్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ప్రచారంలో స్పీడు పెంచిన కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

గుజరాత్ లోని రాజ్‌కోట్‌లోని ఖోదల్‌ధామ్ ఆలయంలో నిర్వహించిన గర్భా వేడుకలకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఓ వేధికపై నుంచి కేజ్రీవాల్‌ ప్రజలకు అభివాదం తెలుపుతున్న సమయంలో వెనక నుంచి ఆయన వైపుగా ఓ వాటర్ బాటిల్ దూసుకొచ్చింది. ఆ బాటిల్ కేజ్రీవాల్ తలపై నుంచి వెళ్లి పక్కన పడటం వల్ల ఆయనకు గాయాలేం కాలేదు.

గుజరాత్ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. అధికారంలోకి వస్తే గోసంరక్షణ కోసం నిధులు కేటాయిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ప్రతి గోవుకు రోజుకు రూ.40 ఇస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆప్ ఓట్లను చీల్చడానికి అధికార బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని విమర్శించారు. గుజరాత్​లో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.